మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కే కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. థర్డ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కొంత ఆలస్యమవుతోంది. అన్ని కుదిరితే ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలుకానున్నట్లు సమాచారం. ఈ మూవీకి పాన్ ఇండియా టచ్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోను విలన్ గా దింపుతున్నట్లు సమాచారం.
గతంలో మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు వేచి చూశారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో అతడు సక్సెస్ సాధిస్తే.. ఖలేజా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా టీవీలో మాత్రం సక్సెస్ అయింది. మధ్యలో వీళ్లిద్దరు కలిసి సినిమాలు చేయలేదు. మళ్లీ వీరి కలయికలో కొత్త సినిమా రాబోతుంది.
ఇది చదవండి : క్రికెట్ చరిత్రలో తొలి సారి డబుల్ హ్యాట్రిక్ సాధించిన బౌలర్
తాజాగా మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కే కొత్త సినిమాకి మహర్షి మూవీలో మహేశ్‌తో జోడి కట్టిన పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి బడా స్టార్ ను రంగంలోకి దింపుతున్నాడట త్రివిక్రమ్. ఆయన ఎవరో కాదు సునీల్ శెట్టి. ఈ హిందీ నటుడు ప్రస్తుతం టాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. గతంలో మోసగాళ్లు, గని లాంటి తెలుగు చిత్రాల్లో నటింటాడు. ఇప్పుడు మహేష్ మూవీల్లో ప్రతినాయకుడిగా మారుతున్నాడట. ఈ విషయంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.