టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్, మాజీ ఎంపీ కృష్ణంరాజు మృతి చెందారు. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె మృతి చెందారు. దాంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మహేష్ బాబుకి తల్లి ఇందిరాదేవితో ఎంతో అనుబంధం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ బాబు తల్లి చాటు బిడ్డలా పెరిగాడు. ఇక అమ్మ అంటే తనకు ఎంతో ప్రేమో పలు సందర్భాల్లో వెల్లడించాడు మహేష్ బాబు. తల్లి మరణం ఆయనను ఎంతో కుంగదీసింది. పైగా ఏడాది వ్యవధిలోనే ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోవడం విచారకరం. మహేష్ సోదరుడు రమేష్ బాబు కూడా కొన్ని నెలల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఇక భారతదేశంలో మృతి చెందిన వారి అస్థికలను గంగలో కలిపితే.. వారు బతికుండగా చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు. చాలామంది తమ కుటుంబ సభ్యులు అస్థికలను గంగలో కలపడానికి దూరభారం లెక్కచేయకుండా వెళ్తారు. తాజాగా మహేష్ బాబు కూడా అదే పని చేశారు. తల్లి ఇందిరా దేవి అస్థికలను గంగలో కలపడం కోసం హరిద్వార్ వెళ్లాడు మహేష్ బాబు. ఆదివారం ఇంటి దగ్గర చిన్న కర్మ అయిపోగానే.. హరిద్వార్ వెళ్లాడు. బేగంపేట నుంచి ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో హరిద్వార్ వెళ్లి.. అస్థికలు గంగలో నిమజ్జనం చేశాడు. ఈ సందర్బంగా మహేష్ బాబు వెంట ఆయన బాబాయ్ ఆదిశేషగిరిరావు, జయదేవ్, సుధీర్ బాబుతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు వెళ్లినట్లు తెలుస్తోంది.
తల్లి మృతితో మహేష్ బాబు.. పూర్తిగా కుంగిపోయారు. చిన్నవాడు కావడంతో.. తల్లితో ఆయనకు అనుబంధం ఎక్కువ. ఇందిరా దేవి ఎక్కడికి వెళ్లినా మహేష్ బాబు తోడుగా ఉండేవాడట. ఎంతో ఆప్యాయంగా తల్లిని రిసీవ్ చేసుకొని దగ్గరుండి ఆమెను ప్రేమగా చూసుకునేవాడు. వారిద్దరి ఫోటోలు చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఇక భర్త కృష్ణ గారి సినిమా షూటింగ్స్ లో కనిపించని ఇందిరా దేవి.. అప్పుడప్పుడు కొడుకు మహేష్ సినిమా షూటింగ్ లోకేషన్స్ లో మాత్రం కనిపించేవారు. ఎందుకంటే.. ఇందిరా దేవికి కొడుకు మహేష్ బాబుతో టైం స్పెండ్ చేయడమంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఇక మహేష్ బాబు పిల్లలకు కూడా ఇందిరా దేవితో మంచి అనుబంధం ఉంది. సమయం దొరికిన ప్రతిసారి నానమ్మ దగ్గరకు వెళ్లి.. ఆమెతో గడిపేవారు. నానమ్మ లేదని తెలిసి సితార తల్లడిల్లిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది.
Mahesh Babu at Haridwar today pic.twitter.com/Eql33d7tLd
— Viking (@ronaldo_mb_dhf) October 2, 2022