టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 47 సంవత్సరాల వయసులో కూడా.. పాతికేళ్ల కుర్రాడిలా యవ్వనంగా, అందంగా కనిపించడం ఒక్క మహేష్‌కే చేతనయ్యింది. అయితే అందమైన రూపంతో పాటు.. అంతకన్న అందమైన మనసు మహేష్ బాబు సొంతం. ఎందరో చిన్నారుల గుండె చప్పుడులో మహేష్ పేరు ప్రతిధ్వనిస్తుంది. సుమారు 2000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. వారికి నూతన జీవితాన్ని ఇచ్చాడు మహేష్. తాజాగా మరో ఏడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి.. నూతన జీవితాన్ని ఇచ్చాడు మహేష్. ఆ వివరాలు..
మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్‌లు చేయిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మహేష్ బాబు మరో ఏడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు. క్రాంతి కుమార్ అనే ఏడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు మహేష్ బాబు. ఈ బాలుడు టెట్రాలజీ ఆఫ్ ఫాలట్ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. 10 వేల మంది నవజాత శిశువుల్లో.. ముగ్గురిలో ఈ సమస్య కనిపిస్తుంది. చిన్న వయసులోనే తగిన చికిత్స అందిస్తే ప్రమాదం ఉండదు.
ఇక క్రాంతి కుమార్ కూడా ఈ సమస్యతోనే జన్మించాడు. వీరి సమస్య కాస్త మహేష్ బాబు దృష్టికి వెళ్లడంతో.. ఆయన క్రాంతి కుమార్ గుండె ఆపరేషన్‌కు సాయం చేశారు. బాలుడికి ఆంధ్రా ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ జరిగింది. ప్రసుత్తం క్రాంతి ఆరోగ్యం నిలకగడానే ఉంది. ఇక మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ప్రీమెచ్యూర్ బేబీ. ఆ సమయంలో గౌతమ్ ఆరోగ్యం గురించి మహేష్ దంపతులు ఎంతో ఆందోళన చెందారు. ఈ సంఘటనే మహేష్ బాబు ఫౌండేషన్‌కి బాటలు వేసింది అని తెలిపారు.
తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి కొడుకు వైద్యం కోసం ఎంతయిన ఖర్చు చేయగలిగాము.. కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి అనే ఆలోచన నుంచి పుట్టిందే మహేష్ బాబు ఫౌండేషన్. దీని ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు మహేష్. తమ అభిమాన హీరో చేస్తున్న మంచి పని చూసి మహేష్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మరి మహేష్ బాబు చేస్తున్న పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.