అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం గుంటూరు కారం. ‘హైలీ ఇన్ఫ్లేమ్మబుల్’ ట్యాగ్ లైన్ పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ ఎస్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఇవాళ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ మామూలుగా లేదు. మాస్ మెంటల్ అంతే. ఈ సినిమాలో మహేష్ చాలా యంగ్ గా కనబడుతున్నారు. అతడు సినిమా సమయంలో ఎలా ఉన్నారో అలా కనబడుతున్నారు.
టీజర్ చూస్తుంటే సినిమా దుమ్ము లేపడం ఖాయమనిపిస్తుంది. మహేష్ మాస్ స్ట్రైక్ ఈసారి బాక్సాఫీస్ ని గట్టిగానే తాకుతుందనిపిస్తుంది. టీజర్ తో గుంటూరు మిర్చి కారం ఘాటు ఎలా ఉంటుందో శాంపిల్ చూపించేశారు. ఇక థియేటర్ లో మొత్తం ఘాటు చూపించనున్నారు. నషాళానికి ఎక్కేలా సినిమా ఉంటుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ టీజర్ లో మహేష్ బీడీ వెలిగించిన స్టైల్ కి ఫ్యాన్స్ కి మెంటలొచ్చేస్తుంది. ఎప్పుడో పోకిరి సినిమాలో సిగరెట్ తాగుతూ కనిపించిన మహేష్ ఇక ఆ తర్వాత ఏ సినిమాలోనూ స్మోకింగ్ సీన్స్ లో నటించలేదు. అలానే ఇంతలా ఊర మాస్ గా కూడా నటించలేదు. కానీ ఇప్పుడు మహేష్ ఊర మాస్ గా నటిస్తున్నారు. చూస్తుంటే ఊర మాస్ కి కేరాఫ్ అడ్రస్ గా మహేష్ బాబు మారిపోయేలా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు. అప్పుడు మొదలవుతుంది అసలైన మాస్ జాతర. మరి టీజర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.