Mahesh Babu: వరుస హిట్లతో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రతి సినిమాలో తన క్యారెక్టర్‌లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన తాజా చిత్రం ‘‘సర్కారు వారి పాట’’లోనూ కొత్త లుక్ అండ్ మ్యానరిజంతో కనిపిస్తున్నారు. తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఈ హీరో బాలీవుడ్ ఎంట్రీపై చాలా ఏళ్ల నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్ తన బాలీవుడ్ సినిమా ఎంట్రీపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నాకు చాలా బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. వాళ్లతో నాకు సరిపోదు అనుకున్నాను. నా టైం వేస్ట్ చేసుకోవాలనుకోలేదు. అందుకే హిందీ సినిమాల వైపు వెళ్లలేదు. నాకు తెలుగులో ఇంత ఆధరణ, ప్రేమ లభిస్తున్నపుడు వేరే ఇండస్ట్రీలోకి నేను ఎందుకు పోతాను. నేను ఎప్పటికీ ఇక్కడే సినిమాలు చేస్తాను.
అవి పెద్ద ఎత్తున రిలీజ్ అవుతాయి. ఇప్పటిలాగే ఇకపై ఎప్పుడు ఇండియా మొత్తం తెలుగు సినిమాలను ఆస్వాధించాలి. తెలుగు సినిమాలే నా బలం.. నేను అర్థం చేసుకోగల ఎమోషన్ కేవలం తెలుగు సినిమా ఎమోషన్ మాత్రమే’’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా, మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘‘ సర్కారు వారి పాట’’ సినిమా మే 12 ప్రేక్షకుల ముందుకు రానుంది. పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. మరి, మహేష్ బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: Mahesh Babu: ఫ్యాన్స్ అభిమానం చూసి ఉద్వేగానికి గురైన మహేష్ బాబు..!