టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఒక సినిమా పూర్తి అయిన తర్వాత.. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్తారన్న విషయం తెలిసిందే. తాజా మహేష్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజ్ అయి విజయం సాధించడంతో ఫ్యామిలీ మొత్తం మరోసారి బ్యాగులు సర్దేశారు. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది.
ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. ఈ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న మహేశ్ బాబు ఫారిన్ టూర్ వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఆయన యూరప్‌లో ల్యాండ్ అయ్యారు. దాదాపు రెండు వారాలు మహేశ్ అక్కడే ఉంటారని సమాచారం. ఫారిన్ ట్రిప్ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. మరి మహేష్ బాబు ఫారెన్ టూర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Anchor Rashmi: పెళ్లి పీటలెక్కిన యాంకర్ రష్మీ!
It’s vacation time superstar #MaheshBabu takes off ✈️ pic.twitter.com/15On9Z0QSY
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) May 22, 2022