సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటనపరంగా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నా.. ఫ్యాన్స్ ఎదురుచూసేది మాత్రం అభిమాన హీరో డాన్స్ కోసమే. ఈ విషయంలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషిగా ఉన్నారు. అందుకు కారణం సర్కారు వారి పాట సినిమాలో మహేష్ డాన్స్ ఇరగదీయడమే. కొంతకాలంగా మహేష్ నుండి మాస్ సాంగ్స్, మాస్ స్టెప్స్ ఎక్సపెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి సర్కారు వారి పాట సాంగ్స్ తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.
తాజాగా విడుదలైన సర్కారు వారి పాట మూవీలో కళావతి పాటకు క్లాస్ స్టెప్పులేసిన మహేష్.. మమ మహేశా పాటకు మాస్ స్టెప్పులు వేసి థియేటర్లలో విజిల్స్ వేయించాడు. పక్కన కీర్తి సురేష్ కూడా మహేష్ తో పాటు మాస్ స్టెప్పులేసి చెలరేగిపోయింది. ఈ సినిమాలో మహేష్ డాన్స్ చూసి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా మహేష్ డాన్స్ చేశాడంటే.. అందుకు కారణమైన వ్యక్తి ఎవరో కాదు.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.
ఒకే సినిమాలో మహేష్ నుండి మాస్, క్లాస్ స్టెప్పులు వేయించేసరికి శేఖర్ మాస్టర్ పై ఓ రేంజిలో కొనియాడుతున్నారు ఫ్యాన్స్. సర్కారు వారి సినిమాలో మహేష్ చాలా కొత్తగా, ఫ్రెష్ గా కనిపించాడు. అదీగాక సినిమా నిండా కావాల్సినన్ని మాస్ డైలాగ్స్ ఉన్నాయి. ఇక అన్నింటిని మించి మహేష్ – కీర్తిల మాస్ డాన్స్ కాంబినేషన్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇకపై కూడా మహేష్ బాబు – శేఖర్ మాస్టర్ కాంబినేషన్ లో మరిన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ రావాలని వారు కోరుకుంటున్నారు. మరి సర్కారు వారి పాటలో మహేష్ డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.