నిజం గడప దాటేలోపే.. రూమర్ ఊరును చుట్టేసి వస్తుందన్నది పెద్దలు చెప్పే మాట. ఇప్పుడు రాజమౌళి, మహేశ్ బాబు విషయంలో ఇదే జరుగుతోంది. సిని పరిశ్రమలో క్రేజీ కాంబినేషన్లకు ఉండే డిమాండే వేరు. ఫలానా ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారన్న వార్త వినబడితే చాలు.. ఆ మూవీ ఎప్పుడు మొదలవుతుంది.. స్టోరీ ఏమిటి.. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది.. హీరోయిన్ ఎవరు.. ఇలా సవాలక్ష సందేహాలు వినబడుతుంటాయి. దీనికి తగ్గట్టుగానే క్రేజీ కాంబినేషన్ కాబట్టి రోజుకో రూమర్ తెరపైకి వస్తుంది. నిజమో అబద్ధమో కూడా తెలుసుకోలేనంత పక్కాగా అవి కనిపిస్తుంటాయి.
వాస్తవానికి బాహుబలి తర్వాతనే మహేష్‌తో రాజమౌళి సినిమా ఉండాల్సి ఉంది. కానీ.., జక్కన్న మాత్రం అనూహ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీ స్టారర్ సినిమాను పట్టాలెక్కించాడు. దీంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు కూడా జక్కన్న ఎప్పుడు అడితే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు రెడీ అన్నట్లుగానే ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు మహేష్ బాబు.. రాజమౌళిల సినిమాకి సంబంధించి ఎలాంటి డీటైల్స్ బయటకి రాలేదు. కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ కాలేదు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అప్పటివరకు మహేశ్ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి సమయం కేటాయించలేని పరిస్థితి. ఆ తరువాత ఎన్ని నెలలకి మహేశ్ మూవీకి స్టోరీ లాక్ అవుతుందో తెలియదు. ప్రీ ప్రొడక్షన్ వరకు ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు. సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఎప్పుడు పూర్తి అవుతుందో అస్సలు తెలియదు. సో రాజమౌళి తో సినిమా చేయాలంటే మహేశ్ బాబు వీటన్నటికి ఓపిక పట్టక తప్పదు. మరోవైపు మహేశ్ బాబు “సర్కారు వారి పాట”తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూట్ పూర్తి అయ్యాక మరో మూవీకి కమిట్ అవ్వాలో, లేక ఖాళీగా రాజమౌళి కోసం ఎదరుచూడాలో తెలియని పరిస్థితి. దీని కారణంగానే మహేశ్ బాబు రాజమౌలి పై సీరియస్ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి.., రాజమౌళి కోసం మహేశ్ అన్ని సంవత్సరాలు ఎదురు చూడవచ్చా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.