ప్రస్తుతం యూట్యూబ్ లో హవా అంతా ప్రైవేట్ ఆల్బమ్స్ దే. బుల్లెట్టు బండి మొదలు కచ్చా బాదం పాట వరకు ప్రైవేట్ ఆల్బమ్స్ ఎంత హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా సోషల్ మీడియాలో ప్రైవేట్ ఆల్బమ్స్ ట్రెండ్ నడుస్తుండటంతో.. స్టార్స్ సైతం వీటిల్లో నటించేందకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ కీర్త సురేష్ కూడా గాంధారి అనే ప్రైవేట్ ఆల్బమ్ లో నటించారు. సినిమా రేంజ్ లో దీనికి ప్రమోషన్స్ చేసినా.. పెద్దగా క్లిక్ అవ్వలేదు. పైగా ఇప్పుడీ ఆల్బమ్ కీర్తి సురేష్ కి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : దళపతి విజయ్ మాస్ క్రేజ్.. మహేష్ బాబుకి ఊహించని షాక్!
ప్రస్తుతం కీర్తి సురేష్, మహేశ్ బాబు సరసన సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. అయితే ఈ నిర్ణయంపై మహేశ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే నెల మహేశ్ బాబుకు కలిసి రాదని.. గతంలో ఆ నెలలో విడుదలైన చిత్రాలు ఫెయిల్ అయ్యానని అంటున్నారు. అంతేకాక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాల్లో నేను.. శైలజా, మహానటి తప్పా మరే సినిమాలు సక్సెస్ కాలేదు. ఇటీవల ఆమె నటించిన పెద్దన్న, గుడ్‌లక్ సఖీ, మిస్ ఇండియా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పొందాయి. దీంతో కీర్తికి ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఇదే సర్కారు వారి పాటకు కొనసాగుతుందేనేమోనని భయపడుతున్నారు అభిమానులు.
ఇది కూడా చదవండి : వీడియో వైరల్: కళావతి పాటకు డాన్స్ ఇరగదీసిన తమన్!
Ava Reaction 🥵🥵🔥🔥#KeerthySuresh #Beast pic.twitter.com/9SJU5h2s3N
— سيباس🥂➅❶ :3 (@UNCR0WNEDKlNG) February 25, 2022
ఇదిలా ఉంటే.. ఆమె నటించిన గాంధారి మ్యూజిక్ వీడియో గా పెద్దగా ఆకట్టుకోకపోవడం ఫ్యాన్స్ ని మరింత కలవరపెడుతుంది. అసలు ఆ పాట సెలక్షనే బాగాలేదని.. అప్ కమింగ్ కళాకారులు సైతం మంచి విజువల్స్ తో ఆకట్టుకునే వీడియోలు చేస్తుండగా.. కీర్తి ఇలాంటి చెత్త మ్యూజిక్ వీడియోల్లో నటించడం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మ్యూజిక్ వీడియో సహజంగా లేదని, పేలవంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఆమె కాస్ట్యూమ్, వీడియో విజువల్స్ పేలవంగా ఉన్నాయని, ఈ సాంగ్ కాపీ కొట్టినట్లు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Finally 👀💥@KeerthyOfficial #KeerthySuresh #Gandhari pic.twitter.com/KV7W3rMFt6
— 𝙹𝚊𝚊𝚗⁷🍂| Kalaavathi 💫🎶 (@Janu_keerthy) February 20, 2022
మహేశ్ బాబు వంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న క్రమంలో ఆమె సెలక్షన్ కూడా అదే స్దాయిలో ఉండాలని, కానీ ఆమె ఇలాంటి సెకండ్ గ్రేడ్ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించి తెలివి తక్కువగా వ్యవహరించింది’ అని నెటిజన్ కామెంట్ చేశాడు. ఇకనైన ఆమె జాగ్రత్తగా ఉండాలని, కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించే వరకు ఇలాంటి మ్యూజిక్ వీడియోలు చేయద్దని ఆమెకు సూచిస్తున్నారు. ఇక గాంధారీ మ్యూజిక్ వీడియోతో ఆమెపై వస్తున్న నెగిటివిటిని చూసి ‘సర్కారు వారి పాట’ మూవీ టీం సైతం కీర్తిపై అప్‌సెట్ అయినట్లు సినీవర్గాల నుంచి సమాచారం. మరి ఈ ట్రోల్స్‌పై కీర్తి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.