సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సర్కారు వారి పాట’. డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ 150 కోట్లవైపు దూసుకుపోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం సర్కారు వారి పాట మూవీ సక్సెస్ మీట్ ని కర్నూల్ లో ఏర్పాటు చేసింది.
ఈ సక్సెస్ మీట్ కి చిత్ర యూనిట్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా మహేష్ బాబు ఎంతో సంతోషాన్ని కనబరిచారు. అలాగే ఎన్నడూ స్టేజిపైకి వచ్చి కాలు కదపని మహేష్.. ఈసారి ఏకంగా మమ మహేశా.. పాటకు థమన్ తో, డాన్సర్స్ తో కలిసి మాస్ స్టెప్స్ చేయడం విశేషం. ప్రస్తుతం మహేష్ బాబు మాస్ స్టెప్స్ కి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలఞ్చ కామెంట్స్ లో తెలియజేయండి.