మరోసారి మంచి మనసు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు!

కొందరకి నచ్చదు. వాళ్లు రీల్ లైఫ్ లోనే హీరోలు.. రియల్ లైఫ్ లో కాదు అనేది కొందరి మాట. కానీ.. ఆ మాటకు అర్థాలే మారుతున్నాయి. నిజ జీవితంలో కూడా తాము హీరోలమే అని నిరూపిస్తున్న సందర్భాలు అనేకం. తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి విపత్తులు వచ్చిన.. తమకు తోచినంత సహాయం చేస్తూనే ఉన్నారు.. సినీ హీరోలు, సినీ ప్రముఖులు. ఇక.. టాలీవుడ్ హీరో మహేష్ బాబు అయితే.. సహాయం చేయడంలో అందరి కంటే మరో అడుగు ముందుంటారు.

మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఎంతో మంది చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయించిన సూపర్ స్టార్.. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సం (ఏప్రిల్ 7) సందర్భంగా ఒకేసారి ఏకంగా 30 మందికి శస్త్ర చికిత్సలు చేయించి వారి ప్రాణాలను నిలబెట్టారు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాలలో 1000 మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయించిన సూపర్ స్టార్.. తాజాగా మరోసారి విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ లో మహేష్ బాబు ఫౌండేషన్ సహాయంతో 30 మందికి గుండె ఆపరేషన్లను నిర్వహించారు.

ఇది కూడా చదవండి: చిన్నారుల గుండె ఆపరేషన్స్ కోసం మరో అడుగు ముందుకేసిన మహేశ్!

ఈ విషయాన్ని ఆయన సతీమణి నమ్రతా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మంచి పనికి సపోర్ట్ ను అందించినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన నమ్రతా.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 30 మందికి గుండె సంబంధిత సర్జరీని నిర్వహించాము. దీనికి సహకరించిన ఆంధ్ర హాస్పిటల్స్ వారికి కృతజ్ఞతలు అంటు రాసుకొచ్చారు. ఎంతో మంది చిన్నారు ప్రాణాలు నిలబెడన్న సూపర్ స్టార్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV