సాధారణంగా ఎవరి జీవితంలోనైనా తల్లి స్థానం ఎంతో ప్రత్యేకమైనది. తల్లితో బిడ్డలకు ఉండే అనుబంధం ఎంతో పవిత్రమైనది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, పాశం ఇవన్నీ తల్లికి బిడ్డకు మధ్య ఆ జన్మాంతం పెరుగుతూ ఉంటాయి. ఎంతో అపురూపంగా చూసుకునే తల్లికి.. బిడ్డలు పెరిగినకొద్దీ వయసు మీదపడటం అనేది మామూలే. కానీ.. ఓ దశలో కన్నతల్లి దూరమైతే పడే బాధను, పేగు బంధం కోల్పోయిన ఫీలింగ్ మనిషిని ఎంతగానో బాధిస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృవియోగ వేదనను అనుభవిస్తున్నాడు. ఈ బుధవారం ఉదయం మహేష్ బాబు తల్లి, కృష్ణ భార్య ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూశారు.
ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే.. మహేష్ బాబు చిన్నప్పటి నుండి తల్లిచాటు బిడ్డలా పెరిగాడు. తన తల్లితో మహేష్ కి ఎనలేని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. కృష్ణ – ఇందిరా దేవిలకు రమేష్ బాబు, మంజుల, మహేష్ ముగ్గురు సంతానం. అయితే.. చిన్న కొడుకుగా మహేష్ బాబును ఎంతో గారాబంగా పెంచింది ఇందిరా దేవి. మహేష్ ఎక్కువ సమయాన్ని తన తల్లి దగ్గరే గడిపాడు. మహేష్ కి తల్లితో పాటు తన అమ్మమ్మతో కూడా అంతే అనుబంధం ఉంది. ఇందిరా దేవి పెద్దగా బయటికి వచ్చేవారు కాదు.. పెద్దగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా కనిపించేవారు కాదు.
ఇక సినిమా కార్యక్రమాలకు పూర్తి దూరంగా ఉండేవారు. అప్పుడప్పుడు ఏదొక శుభకార్యంలో మాత్రమే ఇందిరా దేవి కనిపించేవారు. తన పిల్లలతో టైం స్పెండ్ చేసేవారు. అయితే.. ఇందిరా దేవి ఎక్కడికి వెళ్లినా మహేష్ బాబు తోడుగా ఉండేవాడట. ఎంతో ఆప్యాయంగా తల్లిని రిసీవ్ చేసుకొని దగ్గరుండి ఆమెను ప్రేమగా ట్రీట్ చేయడం.. వారిద్దరి ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. కృష్ణ గారి సినిమా షూటింగ్స్ లో కనిపించని ఇందిరా దేవి.. అప్పుడప్పుడు కొడుకు మహేష్ సినిమా షూటింగ్స్ లో మాత్రం కనిపించేవారు. ఎందుకంటే.. ఇందిరా దేవికి మహేష్ తో టైం స్పెండ్ చేయడమంటే అంత ఇష్టం అన్నమాట.
మహేష్ కి అమ్మంటే ఎనలేని ప్రేమ. ఈ విషయాన్నీ ఎన్నోసార్లు బయట కూడా చెప్పేవాడు. తన తల్లి ఎక్కడికి వెళ్లినా, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అయినా చేయి వదలకుండా వెన్నంటే ఉండేవాడు. చుట్టూ ఎందరున్నా అమ్మతోనే ఎక్కువగా ముచ్చట్లు చెబుతూ, నవ్వుతూ, నవ్విస్తుండేవాడు. అయితే.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లుగా మహేష్ తన తల్లి విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడప్పుడు అమ్మ గురించి స్టేజిపై మాట్లాడుతూ.. తనకు అమ్మంటే దైవంతో సమానం అని చెప్పి ఎమోషనల్ అవ్వడం గతంలో చూశాం. ఇక ఇందిరా దేవి చివరి రోజుల వరకు మహేష్ ఆమె వెన్నంటే ఉన్నాడు. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు చిన్నప్పుడు ఇందిరా దేవీతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
❤️❤️❤️ pic.twitter.com/7Tlso5B3ia
— Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2022
Stay Strong #Mahesh Anna…
Om Shanthi #IndiraDeviGaru pic.twitter.com/PQUPQt3P3T
— Fukkard (@Fukkard) September 28, 2022
Memories 💔🚶😥@urstrulyMahesh #indiradevigaru pic.twitter.com/Bvq7qVQDUH
— Eresh 🔥💥 (@AnantapurDhfm) September 28, 2022
Miss you #IndiraDeviGaru garu 🙏😔 stay strong anna more power & strength to you pic.twitter.com/BxpnKdy0ff
— sai avinash MB Vk ❤ (@avinashsai10) September 28, 2022