టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో మహేష్ అభిమానులను కలవరపెడుతోంది. తమ హీరోకు ఏమయ్యింది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉంది అంటే.. మహేష్ బాబు కేరవ్యాన్. అది కాస్త ఆస్పత్రి వద్ద ఉండటంతో.. మహేష్ బాబు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఏం అయ్యింది అంటూ కంగారు పడుతున్నారు. మరి ఇంతకు ఆ కేరవ్యాన్ ఆస్పత్రి వద్ద ఎందుకు ఉంది.. అంటే..
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. తాజాగా రెండో షెడ్యూల్ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో షూటింగ్‌లో భాగంగా యశోద ఆస్పత్రి వద్ద కొన్ని సీన్లు షూట్ చేస్తున్నారట. దాంతో ఆదివారం నుంచి మహేష్ బాబు కేరవ్యాన్ యశోద ఆస్పత్రి వద్ద ఉందని తెలుస్తోంది. ఇక యశోద ఆస్పత్రి వద్ద మహేష్ బాబు కేరవ్యాన్‌కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజనులు తమకు నచ్చినట్లు ఊహించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటుగా శ్రీలీల కూడా నడిస్తోన్న సంగతి తెలిసిందే.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు సూపర్ డూపర్ హిట్‌గా నిలవగా.. ఖలేజా మాత్రం నిరాశపర్చింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు మహేష్-త్రివిక్రమ్ కాంబినేషనల్ సినిమా వస్తుండటంతో.. దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా ఇది వరకే ఈ సినిమా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత.. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వర్క్ చేస్తాడు. ఇక గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట అంటూ సందడి చేశాడు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం పర్వాలేదనిపించాయి.
Shooting jarugutundhi lopala @urstrulyMahesh 🥰😘#SSMB28 pic.twitter.com/5v3vHaplGf
— DHFM™ (@RCB_CULT) February 5, 2023
Mahesh caravan at hitech city yashoda hospital
Pooja Hegde kuda vachindhi
Babu caravan lo unnadu… pic.twitter.com/sJRSADK6vK— phani (@dhfm_phanindra) February 5, 2023