థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల హవా ఎక్కువ అయ్యింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. అయితే.., తెలుగు ఓటిటి ఆహలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షో రన్ అవుతున్న విషయం తెలిసింది. ఇప్పటికే ఈ షో ద్వారా మంచు ఫ్యామిలి, బ్రహ్మానందం, దర్శకుడు అనీల్ రావిపూడితో మాట్లాడించారు. ఇక రాబోయే ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నాడన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వార్త ఇటు నందమూరి అభిమానులకు, మహేష్ బాబు ఫ్యాన్స్ కు సంతోషానిచ్చే విషయమే. ఈ షోలో బాలకృష్ణ మహేష్ బాబుల మధ్య సంభాషణ ఎలా ఉంటుందో, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు మహేష్ బాబుపై సంధిస్తారు అనేది ఇప్పుడు ఇద్దరి అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. నిజానికి వీరిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వారి అభిమానులకు ఆ కోరిక తీర్చడానికి ఓటీటీలో ఈ షో ద్వారా కనిపించనున్నారు. మరి.. అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్య-,మహేశ్ బాబు ఒకే వేదికని పంచుకోబోతున్నారు అనమాట. మరి.., వీరి ఎపిసోడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.