ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు ‘మేజర్’ సినిమా నిర్మాతగా మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. అడివి శేష్ ప్రధానపాత్రలో నటించిన మేజర్ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. 26/11 ముంబై దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాను అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలతో కలిసి మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు గూఢచారి ఫేమ్ శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు.
ఇక పాన్ ఇండియా మూవీగా మూడు భాషల్లో విడుదలైన మేజర్ సినిమా.. మొదటి ఆటనుండే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే కలెక్షన్స్ మేజర్ సినిమా లాభాల బాట పట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేజర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ టీమ్ అంతా మహేష్ బాబుతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. మహేష్ తో పాటు ఈ మీట్ లో శేష్, శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్, నిర్మాతలు అనురాగ్, శరత్ లు పాల్గొన్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కరుగా వాళ్ళ ఎక్సపీరియెన్స్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత సినిమా గురించి మహేష్ బాబు.. “ఇంతమంచి ప్రాజెక్ట్ ని అందించినందుకు మీకు థాంక్స్. సినిమాలో శేష్ నటిస్తున్నాడని తెలియగానే ఓకే చెప్పేశా. ఎందుకంటే.. గూఢచారి చూసినప్పుడు శేష్ నటన బాగా నచ్చింది.. ఇక అమ్మాయిల గురించి చెప్పాలంటే..” అంటుండగా నిర్మాత ఒకరు మధ్యలో వేరే మాట్లాడబోయారు. వెంటనే మహేష్.. “అమ్మాయిల గురించి మాట్లాడుతుంటే మధ్యలో వస్తారేంటండీ. అమ్మాయిల గురించి మాట్లాడనివ్వండి కాస్త” అంటూ సెటైర్లు వేస్తూ నవ్వులు పూయించాడు. ప్రస్తుతం మహేష్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.