ఇటీవల సినీమా, బుల్లితెర ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కారణాలే ఏవైనా కావొచ్చు.. తాము అభిమానించే నటీనలు ఇంతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడం కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులో శోక సంద్రంలో ముగినిపోతున్నారు. గత నెలలో బుల్లితెర నటులు ఆదిత్య సింగ్ రాజ్ పూత్, వైభవి ఉపాధ్యాయ, నితీష్ పాండే వరుసగా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ టీవీ,సినీ నటుడు గుఫీ పెంటల్ అనారోగ్యంతో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ఒకప్పుడు బుల్లితెరపై రామాయణం, మహాభారత్ సీరియల్స్ సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఎన్నో టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించిన ఈ రెండు సీరియల్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. ఇటీవల రామాయణం, మహాభారత్ సీరియల్స్ లో నటించిన ప్రముఖ నటీనటులు వరుసగా కన్నుమూస్తున్నారు. బీ.ఆర్.చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘మహాభారత్’ సీరియల్ ని ఇఫ్పటికీ జనాలు మర్చిపోలేరు. ఇందులో శకుని మామగా తనదైన మేనరీజంతో ప్రేక్షకులను అలరించిన నటుడు గుఫీ పెంటల్ (79) అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా బీపీ, గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
చిన్నతనంలో పలు నాటకాల్లో నటించిన గుఫీ పెంటల్ 1975 లో రఫూ చక్కర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో రిషీ కపూర్, నీతూ కపూర్ లతో కలిసి నటించాడు. సుహాగ్, దావా, ఘూమ్ వంటి మూవీస్ లో నటించారు. తర్వాత మహాభారతంలో ఆయనకు శకుని పాత్రలో నటించే అవకాశం లభించింది. శకుని పాత్రలో తనదైన విలనీజం చూపించి అందరినీ ఆకట్టుకున్నారు గుఫీ పెంటల్. ఈ తర్వాత బహదూర్ షా జఫర్, సీఐడీ, రాధా కృష్ట లాంటి పలు సీరియల్స్ లో నటించారు. ఆయన మృతిపై బుల్లితెర, వెండితెర ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
Due To Ignorance Of Both…: When Gufi Paintal Reacted To Mahabharat Co-stars Mukesh Khanna, Gajendra Chauhan’s Feud.https://t.co/VlCFHwAYfs
— TIMES NOW (@TimesNow) June 5, 2023