‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి మూడేళ్ళ విరామం తర్వాత మహాసముద్రం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. నిజ జీవిత సంఘటనల సమూహారంతో అద్భుతమైన భావోద్వేగాల సన్నివేశాలతో యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ గా మహాసముద్రం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. సక్సెస్ ఫుల్ చిత్రాల కథానాయకులు శర్వానంద్, సిద్ధార్డ్ హీరోలుగా హను ఇమ్మనుయెల్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని రూపొందించారు.
రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ టెర్రిఫిక్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. రాజ్ తోట కెమెరా విజువల్స్, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, రామబ్రహ్మం మేకింగ్, అజయ్ భూపతి టేకింగ్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.. ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రీతిలో అనుక్షణం ఉత్కంఠతని కలుగజేసే విధంగా అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే సన్నివేశాలను చిత్రీకరించారు.. టైటిల్ కి తగ్గట్లే అత్యద్భుతమైన కథతో, అబ్బురపరిచే సన్నివేశాలతో మహాసముద్రం చిత్రం ఉండబోతుంది.
ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.. అందరి అంచనాలకు మించి ఈ చిత్రం ఉండబోతుందని.. ఆల్ రెడీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చిత్ర యూనిట్ లో టాక్ వినిపిస్తుంది.. ఇక అక్టోబర్ 14న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఆడియెన్స్ ని మెస్మ రైజ్ చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు అని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది..!!