మూడేళ్ళ క్రితం “ఆర్ఎక్స్ 100” మూవీతో దర్శకుడుగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. ఆ మ్యాసివ్ హిట్ తరువాత ఆయన రెండో సినిమా “మహా సముద్రం” ప్రేక్షకుల ముందుకి రావడానికి ఇంత కాలం పట్టింది. శర్వానంద్, సిద్దార్ద్ హీరోలుగా నటించిన మహా సముద్రం ఎన్నో అవాంతరాలను దాటుకుని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. అసలు మహా సముద్రం ఎలా ఉంది? అజయ్ భూపతి ఈ సినిమా కోసం ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది? కథని నమ్మి రిస్క్ చేసిన శర్వాకి, సిద్దార్ద్ కి శ్రమకి తగ్గ ఫలితం దక్కిందా లేదా? అన్న విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
మహా సముద్రం మూవీ ప్యూర్ ఇన్టెన్స్ లవ్ స్టోరీ. రెండు భిన్నమైన మార్గాల్లో ప్రయాణించే ఇద్దరు వ్యక్తుల జీవితంలోకి.. ఒక అమ్మాయి వస్తుంది. ఆమె రాకతో వీరిద్దరి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హీరోలు ఇద్దరికి గూడు బాబ్జీతో గొడవలు మొదలవుతాయి. మరి.. హీరోలు ఇద్దరు తమ ప్రేమని నెగ్గించుకోవడానికి ఒక్కటయ్యారా? న్యాయాన్ని కాపాడటానికి ఒక్కటయ్యారా? అసలు ఎవరిపై ఎవరు పై చేయి సాధించారు అన్నదే మహా సముద్రం కథ.
విశ్లేషణ:
దర్శకుడి అజయ్ భూపతి ఈ కథని పట్టుకుని ఏడాది పాటు చాలా మంది పెద్ద హీరోల చుట్టూ తిరిగాడు. వారంతా స్క్రిప్ట్ మారిస్తే, సోలో హీరోగా అయితే డేట్స్ ఇస్తాము అన్న వారే. కానీ.. అజయ్ మహా సముద్రం కథని మాత్రం మార్చలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఓ మంచి కథ చేతిలో ఉంటే దర్శకుడికి ఎంత నమ్మకం వస్తుందో చెప్పడానికి. మహా సముద్రం అంతటి మంచి కథ.
ఈ సినిమాలో చాలా సేపు శర్వా, సిద్దార్ధ్ మధ్య గొడవలు జరుగుతున్నా, అక్కడ మనం హీరో, విలన్ అన్న క్యాలిక్యులేషన్స్ వేసుకోకుండా మూవీని చూడగలుగుతాము. కొన్ని కొన్ని దగ్గరలా దళపతి మూవీ రిఫరెన్స్ క్లియర్ గా అర్ధం అవుతూ ఉంటుంది. అయినా.. మహా సముద్రం కథలోని ఆ ఇంటెన్స్ మాత్రం ఎక్కడా డిస్టర్బ్ అవ్వదు.
ఇక గూడు బాబ్జిగా రావు రమేశ్ ఎంటర్ అయ్యాక కథ పరుగులు పెట్టింది. మహా సముద్రం సినిమా మొత్తానికి ప్రాణం అయిన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోయింది. దీంతో.. ఫస్ట్ వరకు ప్రేక్షకులను సూపర్బ్ గా ఎంగేజ్ చేస్తుంది. అయితే.. సెకండ్ ఆఫ్ కి వచ్చేసరికి దర్శకుడు పూర్తిగా ఎమోషన్స్ మీదకి వెళ్ళిపోయాడు.
ఇక్కడ కథ కాస్త నెమ్మదించినా ఆయా పాత్రల భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ కూడా మహా సముద్రానికి పెర్ఫెక్ట్ గా కుదరడం విశేషం. నటులుగా శర్వా, సిద్దార్ధ్, అదితిరావు హైదరి కెరీర్ బెస్ట్ ఇచ్చేశారు. ఇక మహా సముద్రానికి ప్రాణం పోసింది మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్. ఇలాగే.. మిగిలిన టెక్నీకల్ వర్క్స్ అంతా మహా సముద్రానికి బాగా కుదిరాయి. ఇక దర్శకుడుగా అజయ్ భూపతి మరోసారి సూపర్బ్ అనిపించుకున్నాడు. కానీ.., అజయ్ భూపతి సెకండ్ ఆఫ్ పై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే మహా సముద్రం స్థాయి ఇంకాస్త పెరిగి ఉండేది.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్:
చివరి మాట:
మహా సముద్రం: చాలా లోతైన కథ. తప్పక చూడొచ్చు.