సాధారణంగా సినిమాల్లో హీరోలు రక రకాల కష్టాలు ఉంటాయి. ఎలాగో అలా వాటిని ఎదుర్కొని సినిమాకు ఎండ్ కార్డు వేస్తాడు హీరో. అయితే కొన్ని సార్లు నిజ జీవితంలో కూడా హీరోలకు కష్టాలు ఉంటాయి. అలాంటి కష్టం ఇప్పుడు తమిళ హీరో ధనుష్ కి వచ్చింది. ఆయన తమ కొడుకు అంటూ మధురై మేలూరు కోర్టులో కతిసేరన్, మీనాక్షి దంపతులు కేసు వేశారు. ఈ వ్యవహారం కాస్త కోర్టు వరకు వెళ్లింది. ఆ కేసు నాలుగు సంవత్సరాలు సాగి చివరికి ధనుష్ కే సపోర్ట్ గా ఉండటంతో ఆ కేసుని కొట్టేశారు.
ఈ ఎపిసోడ్ కి శుభం కార్డు పడిందని ధనుష్ భావించేలోపు మరో కొత్త కష్టం వచ్చిపడింది. తమిళనాడు హైకోర్టు ధనుష్ కి సమన్లు జారీ చేసింది. కతిసేరన్, మీనాక్షి దంపతులు మరోసారి మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. తాము వృద్దాప్యంలో ఉన్నామని.. ధనుష్ తమ కుమారుడు కాబట్టి తమకు నెలకు 65 వేల రూపాయలు చెల్లించాలని వారు కోరారు. ధనుష్ తాను మాత్రం కస్తూరి రాజకుమార్ కుడుకు అని.. కాబట్టి వాళ్లకు అరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం కరెక్ట్ కాదని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయనకు కోర్టు నుంచి మళ్లీ సమన్లు రావడం పెద్ద తలనొప్పిగా మారింది.