హీరోహీరోయిన్ ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు పెద్ద విషయమేం కాదు. సినిమాలు, వెబ్ సిరీసుల్లో ఈ తరహా సీన్స్ మనం ఎప్పటికప్పుడూ చూస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది చాలా సాధారణ విషయమైనప్పటికీ.. ఓ ఇరవై ఏళ్లు, అంతకంటే ముందే దీన్నో ఓ వింతలా చూసేవారు. ఒకవేళ తమ సినిమాలో ముద్దు సన్నివేశాలుంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. అలా గత కొన్నేళ్ల నుంచి మాత్రం ఇలాంటి సీన్స్.. ఆలోవర్ ఇండియన్ మూవీస్ లో చాలా కామర్ థింగ్ అయిపోయాయి.
ఇక విషయానికొస్తే.. ఆలోవర్ భారతీయ సినీ చరిత్రలో అత్యంత విలువైన ముద్దు అంటే చాలామంది.. ‘దయావన్’లోని సీన్ అనే చెప్తారు. ఎందుకంటే ఈ మూవీ 1988లో థియేటర్లలోకి వచ్చింది. ఫిరోజ్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య అదిరిపోయే రేంజులో లిప్ లాక్ సీన్ ఉంది. దీన్ని చూసి అప్పట్లో అందరూ షాకైపోయారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజయ్యే టైంకి మాధురీ దీక్షిత్ స్టార్ హీరోయిన్ గా ఉంది. అలాంటి ఆమె ఏ కారణంతో ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చిందా అని ఇప్పటికీ జర్నలిస్టులు ఆమెని అడుగుతూ ఉంటారు.
ఈ సీన్ పై స్పందించిన మాధురీ దీక్షిత్.. ‘నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది’ అని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సీన్ తో పాటు సినిమాలో నటించేందుకుగానూ మాధురీ దీక్షిత్ కు భారీ మొత్తంలో అంటే అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని, అందుకే ఆమె నో చెప్పలేకపోయిందనిపిస్తోంది. అప్పట్లో కేవలం అమితాబ్ కు మాత్రం కోటివరకు ఇచ్చేవారు. అలాంటిది తనకు కూడా ఇస్తానని చెప్పేసరికి మాధురి నో చెప్పలేకపోయి ఉంటుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి కోటి రూపాయలు విలువ చేసే ఈ ముద్దుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.