సీనియర్ హీరోయిన్ మధుబాల అందరికీ పరిచయమే. తమిళ్ అనువాద చిత్రాలైన రోజా, జెంటిల్ మెన్ సినిమాల్లో నటించి ఇక్కడ తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఇక ఈమె ఇటీవలే విడుదలైన శాకుంతలం సినిమాలో సమంతకి అమ్మ పాత్రలో నటించింది. తాజాగా శాకుంతలం ఫెయిల్యూర్ పై ఆమె స్పందించారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో కొంతమంది షాకింగ్ కామెంట్స్ చేయడం మామూలే. అయితే చాలా కొద్ది మంది మాత్రం హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. కాస్తయినా ఆలోచించకుండా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తారు. ఇటీవలే కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కెజిఎఫ్, ట్రిపుల్ఆర్ అనేవి పాప్ కార్న్ సినిమాలని విమర్శలు చేసాడు. ఈ వివాదం చాలా వరకు వెళ్ళింది. ఇక తాజాగా.. శాకుంతలం సినిమా ప్లాప్ అవ్వడానికి నాగ చైతన్య ఫ్యాన్స్ కారణమంటూ వింత సమాధానమిచ్చింది బిగ్ బాస్ ఫేమ్ ఆరోహి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఒక సీనియర్ నటి మధుబాల బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలు ప్లాప్ అవ్వాల్సిన సినిమాలు అని చెప్పుకొచ్చింది.
సీనియర్ హీరోయిన్ మధుబాల అందరికీ పరిచయమే. తమిళ్ అనువాద చిత్రాలైన రోజా, జెంటిల్ మెన్ సినిమాల్లో నటించి ఇక్కడ తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఇక ఈమె ఇటీవలే విడుదలైన శాకుంతలం సినిమాలో సమంతకి అమ్మ పాత్రలో నటించింది. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత లీడ్ రోల్లో కనిపించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకుంది. తాజాగా శాకుంతలం ఫెయిల్యూర్ పై ఆమె స్పందించారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
మధుబాల మాట్లాడుతూ.. “శాకుంతలం సినిమా ఎందుకు ప్లాప్ అయిందో అర్ధం కావడం లేదు. ఈ విషయం తెలిసి చాలా బాధ పడ్డాను. ఎందుకంటే నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్, నటీనటులు ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. వాళ్ళ బెస్ట్ అందించారు. విసువల్ వండర్ అందించేందుకు సీజి వర్క్ కోసం వారు 6 నెలలు కష్టపడ్డారు. ఈ సినిమా కోసం ఏ ఒక్కరూ ఒత్తిడిగా భావించలేదు.అందరికీ కావాల్సిన ఫ్రీడమ్ ని ఇచ్చారు. అయినప్పటికీ ఈ సినిమా ఎందుకు క్లిక్ అవ్వలేదో అర్ధం కావడం లేదు. మరోవైపు బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయో అర్ధం కావట్లేదు. ఆ చిత్రాల విజయాలకు కారణమేంటో ఎవరూ చెప్పలేదు. శాకుంతలం కూడా ఈ ఫ్లేవర్ లో తెరకెక్కిందే. పైగా ఇది పురాణాలకు చెందిన కథ. ఈ సినిమా ఎందుకు ప్లాప్ వెనుక కారణం అర్ధం కావడం లేదు” అని ఓ వైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే మరోవైపు సంచలన కామెంట్లు చేసింది. మధుబాల చేసిన ఈ వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి.