ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇంతకాలం బ్యాచిలర్ లైఫ్ ని ఆస్వాదించిన హీరోయిన్లు, సీరియల్ ఆర్టిస్టులంతా ఈ మధ్యే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కరుగా వరుసగా పెళ్లి వార్తలతో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతార–విగ్నేష్ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి తెలుగు బ్యూటీ, హీరోయిన్ మధుశాలిని చేరింది. పదిహేనేళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మధుశాలిని.. అందరివాడు సినిమాతో తెలుగు డెబ్యూ చేసింది. ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన కితకితలు సినిమా చేసి మంచిక్రేజ్ దక్కించుకుంది. అనంతరం తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే.. హీరోయిన్ గా సినిమాలైతే చేసింది కానీ.. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అయింది. ఇక తాజాగా 9 అవర్స్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మధు శాలిని గోకుల్ ఆనంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
ఈ క్రమంలో మధుశాలిని అభిమానులంతా.. ఎవరీ గోకుల్ ఆనంద్.. అతడి వివరాలు ఏంటి అని తెగ సర్చ్ చేస్తున్నారు. మధుశాలిని వివాహం చేసుకున్న గోకుల్ ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.. కానీ తమిళ జనాలకు ఇతడు బాగానే తెలుసు. తొలుత మళయాలంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీన్‌ని ప్రారంభించారు గోకుల్ ఆనంద్. ఆయన నటించిన పలు టీవీ షోలు మలయాళ ఛానల్స్‌లో ప్రసారమయ్యాయి. ఇక 14 ఏళ్ల వయసులో రామాయణం తమిళ వెర్షన్‌కి సంబంధించిన నాటకంలో నటించారు గోకుల్ ఆనంద్. ఆ తర్వాత రెండేళ్లకు ‘ఏవం’ అనే ఫేమస్ థియేటర్ గ్రూప్‌లో చేరారాయన. అక్కడే రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Madhu Shalini: సీక్రెట్ గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. ఫోటోలు వైరల్!
2008లో చెన్నైలో ‘The Boardwalkers’ అనే థియేటర్ కంపెనీతో కలిసి పని చేశారు గోకుల్ ఆనంద్. ఆ తర్వాత యాక్టర్ అవ్వాలనే కోరికతో బీఏలో యాక్టింగ్ కోర్స్ చేశారు. ఆ తరువాత ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఎన్నో ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అతడికి మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా ‘చెన్నై టూ సింగపూర్’ అనే సినిమాలో లీడ్ రోల్‌లో నటించే అవకాశం సంపాదించుకున్నారు. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. హీరోగా గోకుల్ ఆనంద్‌కి మంచి పేరొచ్చింది.
ఇది కూడా చదవండి: B Praak: ప్రముఖ సింగర్ ఇంట విషాదం.. పుట్టిన వెంటనే చనిపోయిన బిడ్డ!
అతడి లుక్స్‌కి, స్క్రీన్ ప్రెజన్స్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత ‘పంచాక్షరం’, ‘తిట్టమ్ ఇరండు’, ‘నడువన్’ వంటి సినిమాల్లో నటించారు. నటుడిగా అతడికి బ్రేక్ ఇచ్చిన సినిమాలైతే ఇప్పటి వరకైతే ఇంకా రాలేదు. అయితే ఇప్పటికి కూడా ఒకటి, అరా అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నారు. ‘పంచాక్షరం’ సినిమా సమయంలో మధు షాలినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఆమెని పెళ్లి చేసుకున్నారు గోకుల్ ఆనంద్. ప్రస్తుతం ఆయన మలయాళంలో ‘జాక్ అండ్ జిల్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pushpa: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుష్ప కేశవ ఫోటో!