రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాతో మరోసారి తన సత్తా చాటిన మాధవన్.. మరో హిట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ధోకా రౌండ్ డి కార్నర్’ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ముంబైలో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవన్ బాలీవుడ్ వరుస సినిమాల ఫెయిల్యూర్స్‌పై, అలానే ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఫెయిల్యూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఇదొక్కటే కాదు దీని కంటే ముందు రిలీజైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచాయి.
దీనిపై స్పందిస్తూ మాధవన్.. “మనకి తెలుసు లాల్ సింగ్ చడ్డా సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో. సినిమాలు చేస్తున్నంతసేపు మనమంతా హిట్ సినిమాలని చేస్తున్నామని అనుకుంటాం. మనం చెత్త సినిమా చేస్తున్నామని మనం ఎవరం అనుకోము. కానీ మనం మంచి కంటెంట్ ఇవ్వగలిగితే ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమా చూస్తారు. అది ఏ భాషకి చెందిన సినిమా అయినా గానీ ఆదరిస్తారు. కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత సినిమా విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారిందని, ఇదే బాలీవుడ్ సినిమాల ఫెయిల్యూర్‌కి కారణమని అన్నారు. కాబట్టి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారని మాధవన్ అన్నారు. లాల్ సింగ్ చడ్డా సినిమాతో సహా బాలీవుడ్‌లో మిగతా సినిమాలు ఫెయిల్ అవ్వడానికి ఆడియన్స్ టేస్ట్ కారణమన్న మాధవన్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.