మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో తమ ప్యానల్ సభ్యులపై మోహన్‌బాబు, నరేష్ దాడి చేశారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజ్‌లో రికార్డు అయ్యాయని, ఆ సీసీ టీవీ పుటేజ్‌ను తమకు అందజేయాలని ప్రకాశ్‌రాజ్ కోరారు. అందుకు మా ఎన్నికల అధికారి నిరాకరించారు. పూర్తిగా పరిశీలించిన తర్వాతనే సీసీ టీవీ పుటేజ్ బయటకు ఇస్తామని అన్నారు. దీంతో సీసీటీవీ పుటేజ్‌ను మాయం చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోలింగ్ జరిగిన స్కూల్‌లోని సర్వర్ రూమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, దాన్ని సీజ్ చేశారు. దాడి జరిగిన దృశ్యాలు అందులో ఉన్నాయని చూపించండి అని ప్రకాశ్‌రాజ్ అభ్యర్థనను ఎన్నికల అధికారి ఈ విధంగా నిరాకరించడంతో సినీ వర్గాల్లో నిజంగానే దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరీ ఎన్నికల అధికారి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.