సినిమాల్లో కామెడీ తరహాలో ఉండే బోల్డ్ పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కళ్యాణికి.. మా సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. దీనికి కారణమేంటని పరిశీలిస్తే..
బోల్డ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు ఎంతమంది ఉన్నారో.. వివాదాల్లోకి చిక్కుకున్న వారు కూడా అంతే మంది ఉన్నారు. ఈ లిస్టులో ఖచ్చితంగా కరాటే కళ్యాణి ఉంటుంది. ఏమనిపిస్తే అది చెప్పడం ఈమెకు ముందునుంచి అలవాటే. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది కరాటే కళ్యాణి అనవసరం. సినిమాల్లో కామెడీ తరహాలో ఉండే బోల్డ్ పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కళ్యాణి తాజాగా ఒక సీనియర్ ఎన్టీఆర్ విషయంలో సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో విమర్శలు మూటగట్టుకున్న కరాటే కళ్యాణికి .. మా సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు స్థాయి, స్థానం ప్రత్యేకం. అలాంటి నటుడుని టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోనే ఉంటుంది. సినిమా రాజకీయ రంగాల్లో ఎనలేని ప్రజలను అలరిస్తూ.. వారికి ఎనలేని సేవచేస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ లెజెండ్ విషయంలో కరాటే కళ్యాణి కి ఒక కొత్త సమస్య వచ్చి చేరింది.ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహం ప్రతిష్టించడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్నితయారుచేయించారు. ఈనెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతిష్టించాలనుకున్నారు. అయితే… ఈ విగ్రహ ఏర్పాటును కరాటే కళ్యాణి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కరాటే కళ్యాణీ పాలిట శాపంగా మారాయి.
తెలుగు సినిమాకు గర్వకారణమైన తారక రామారావు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నటి కరాటే కళ్యాణీని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ “మా” సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ‘మా’ సభ్యురాలిగా ఉన్న కరాటే కళ్యాణీని క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అసోసియేషన్‌లో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనరల్ సెక్రటరీ వై.రఘుబాబు గురువారం కరాటే కళ్యాణీకి సస్పెన్షన్ నోటీసు పంపించారు. ఈనెల 16 జారీ చేసిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువు లోపల వివరణ ఇవ్వకపోగా లీగల్ నోటీసు పంపడం ‘మా’ సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని సస్పెన్షన్ నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 23న జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో కరాటే కళ్యాణి ప్రవర్తనపై చర్చించి.. ‘మా’ బైలాస్‌లోని క్లాజ్ నంబర్ 8 ప్రకారం తక్షణమే సస్పెన్షన్ అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.