బుల్లితెర పై వినోదాన్ని పంచే కార్యక్రమాలు ఎన్నో పుట్టుకొస్తుంటాయి. కొన్ని కార్యక్రమాలు రెగ్యులర్ ఫీల్ ని కలిగిస్తాయి. కానీ.. కొన్ని మాత్రమే ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఫీల్ ని కలిగిస్తాయి. ఎందుకంటే.. కామెడీ షోలు, రియాలిటీ షోలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. అయితే.. జనాల్ని ఎంటర్టైన్ చేసే ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్ మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ప్రముఖ టీవీ ఛానల్ జీ వారు ‘జీ తెలుగువారి జాతర అందరూ ఆహ్వానితులే’ అనే కొత్త ఎపిసోడ్ తో ఈ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆ కార్యక్రమానికి సంబంధించి కొత్తగా ‘రియల్ కపుల్స్ టీసింగ్’ అని పేరుతో ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో అన్ని జంటలు చూసినట్లుగానే కనిపిస్తున్నాయి. కానీ.. ఒక్క జంట మాత్రం స్టేజిపై కొత్తగా, అందరినీ అట్రాక్ట్ చేసింది. ఆ జంట ఎవరో కాదు ప్రముఖ సినీగేయ రచయిత అనంత శ్రీరామ్ దంపతులది. మొదటిసారి అనంత శ్రీరామ్ ఆయన భార్య స్వాతితో ఈ టీవీ షో స్టేజిపై ప్రత్యక్షమయ్యారు. ఇదివరకు ఎన్నో టీవీ షోలలో సింగిల్ గా ఎంట్రీ ఇచ్చి సందడి చేసిన అనంత శ్రీరామ్.. ఇప్పుడు భార్యను తీసుకొని రావడంతో అంతా సర్ప్రైజ్ అయ్యారు.
అదీగాక అనంత శ్రీరామ్ డ్యాన్స్ ఎలా ఉంటుందో కొద్ది వారాల కిందటే చూశారు ప్రేక్షకులు. ఇక ఈ ఆదివారం ఆయన సతీమణితో కలిసి చేయబోయే స్టేజి పెర్ఫార్మన్స్ చూడబోతున్నారు ఆడియెన్స్, ఫ్యాన్స్. అయితే.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ‘జీ తెలుగువారి జాతర అందరూ ఆహ్వానితులే’ ప్రోగ్రాం స్టార్ట్ కాబోతుంది. మరి ప్రస్తుతం అనంత శ్రీరామ్ దంపతుల ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.