తెలుగు చిత్రపరిశ్రమలో గేయ రచయితగా మంచి గుర్తింపు పొందినవారిలో అనంత శ్రీరామ్ ఒకరు. ఆయన చూడటానికి ఎంత సౌమ్యంగా కనిపిస్తాడో.. ఆయన రాసే పాటలు కూడా అంతే సౌమ్యంగా ఉంటాయి. అయితే.. ఎల్లప్పుడూ సాఫ్ట్ గా కనిపిస్తూ.. చక్కగా మాటలతో మెప్పించే అనంత శ్రీరామ్.. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మరి అంతలా ఆశ్చర్యపోవడానికి అనంత శ్రీరామ్ ఏం చేశాడో తెలుసా!
మనకు తెలిసినట్లుగా పాట పాడటమో, ప్రాసతో కూడిన మాటలు చెప్పడమో కాదు.. ఏకంగా అదిరిపోయే డాన్స్ చేసి షాకిచ్చాడు. అదికూడా మాములు స్టెప్పులు కాదు.. ఫ్లోర్ స్టెప్స్ తో.. హై జంప్ స్టంట్స్ తో ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇరవై ఏళ్లకే సినీ గేయ రచయితగా మారిన అనంత శ్రీరామ్.. గురించి ప్రేక్షకులు సౌమ్యమైన మాటలు, చక్కని మాటలు అనే అభిప్రాయంలో ఉన్నారు.ఇప్పుడు వారందరినీ తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఖంగుతినేలా చేసాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అనంత శ్రీరామ్ అంటే క్లాస్ మాత్రమే కాదు.. డాన్స్ చేసి మెప్పించే మాస్ పర్ఫార్మర్ కూడా ఉన్నాడని అంటున్నారు. మరికొందరు ‘అనంతా అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అనంత శ్రీరామ్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘సరిగమప‘ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న అనంత శ్రీరామ్.. ఇటీవల డాన్స్ తో మాస్ ఎంట్రీ ఇవ్వడం బిగ్ సరప్రైజ్ గా మారింది. మరి అనంత శ్రీరామ్ డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
😵💫😵💫😵💫 pic.twitter.com/zkiumeUuWI
— …. (@ynakg2) March 9, 2022