సినిమాలన్నాక లిప్ కిస్ లు సహజం. ఇష్టం ఉన్నా లేకున్నా లిప్ లాక్ సీన్స్ లో నటించాల్సిందే. అలా అయిష్టంగా లిప్ లాక్ సీన్ లో హీరోకి ముద్దు పెట్టి తర్వాత నోరు శుభ్రం చేసుకున్నారట. ఆ హీరో ఎవరు? అసలేం జరిగింది?
సినిమాలన్నాక లిప్ కిస్ లు కామన్. సీన్ ఇంటెన్సిటీ కోసం ఇంటిమేట్ సీన్స్ లో నటించమని దర్శకులు డిమాండ్ చేస్తారు. దీంతో ఇష్టం ఉన్నా, లేకున్నా గానీ కమిట్మెంట్ ఇచ్చాక చేయాల్సిందే. అయితే ఓ హీరోకి లిప్ కిస్ పెట్టాల్సి వస్తే ఆ హీరోయిన్ తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టిందట. ఆ తర్వాత డెటాల్ తో నోరు శుభ్రం చేసుకున్నారట. ఆమె ఎవరో కాదు.. లస్ట్ స్టోరీస్ 2 నటి నీనా గుప్తా. ఓ హీరోతో లిప్ లాక్ సన్నివేశంలో నటించేటప్పుడు చాలా టెన్షన్ పడ్డారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటనను పంచుకున్నారు. 90స్ ప్రారంభంలో వచ్చిన దిల్లగి అనే సీరియల్ లో హీరో, హీరోయిన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుంది. అప్పట్లో ఇది వివాదానికి దారి తీసింది.
అలాంటి సీన్ లో సహ నటుడు దిలీప్ ధావన్ తో చేయాల్సి వచ్చిందని అన్నారు. భారతదేశ చరిత్రలో టీవీ సీరియల్ లో లిప్ కిస్ సీన్ చూపించడం అనేది అదే తొలిసారి అని అన్నారు. ఈ సీరియల్ లో మా ఇద్దరి మధ్య శారీరక సాన్నిహిత్యం ఉందని తెలిసేలా ఓ లిప్ లాక్ సీన్ ని పెట్టారు. అది సీరియల్ ప్రమోషన్ కి బాగా కలిసి వచ్చింది కానీ తమకు మాత్రం ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. ఆర్టిస్ట్ అన్నాక అన్ని రకాల సీన్స్ లో నటించాలని.. ఒక్కోసారి బురదలోకి వెళ్లాలని.. కొన్నిసార్లు కొన్ని గంటల పాటు ఎండలో నిలబడాలని అన్నారు. అలానే ముద్దు సన్నివేశం అయినా సరే చేయాల్సిందేనని ఆమె అన్నారు. అలా తాను కూడా దిలీప్ ధావన్ తో లిప్ కిస్ సీన్ చేశానని అన్నారు.
అయితే ఆరోజు రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదని అన్నారు. చూడడానికి దిలీప్ ధావన్ బాగుంటాడని.. కానీ ఫిజికల్ గా, మెంటల్ గా తాను సిద్ధంగా లేనని.. అయితే తనను తాను కన్విన్స్ చేసుకుని ముద్దు సీన్ లో పాల్గొన్నానని ఆమె అన్నారు. అప్పుడు చాలా టెన్షన్ పడ్డానని అన్నారు. కొంతమంది కామెడీ చేయలేరు, కొంతమంది కెమెరా ముందు ఏడవలేరు. కానీ తాను మాత్రం చేసేయాలి అని అనుకుని సీన్ పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే ముద్దు సన్నివేశం అయిపోయాక తన నోటిని డెటాల్ తో శుభ్రం చేసుకున్నానని ఆమె వెల్లడించారు. సీరియల్ ప్రసారం చేసిన ఛానల్ కి మా లిప్ లాక్ సీన్ గోల్డెన్ ఛాన్స్ లా దొరికిందని.. ఎపిసోడ్ ని ప్రమోట్ చేయడానికి ఈ ముద్దు క్లిప్ ని బాగా వాడుకుందని అన్నారు.
అయితే అప్పట్లో ఎక్కువ టీవీ ఛానల్స్ లేవు, ఎక్కువ టీవీలు కూడా లేవు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసి ఒకే చోట కూర్చుని టీవీ చూసేవారు. అయితే ఆ కిస్ సీన్ చూసి చాలా మంది వ్యతిరేకత కనబరిచారు. దీంతో ఆ లిప్ లాక్ ని తొలగించడం జరిగింది. ఈమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. శృంగార నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో డబుల్ మీనింగ్ డవిలాగులతో పాటు.. పడక సన్నివేశాలు కూడా ఉన్నాయి. పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలి అని చెప్పిన నటి నీనా గుప్తానే. ఈ సిరీస్ లో మృణాల్ ఠాకూర్ బామ్మ గా నటించారు నీనా గుప్తా.