ఈ బ్యూటీని చూడగానే అరే ఈమెని ఎక్కడో చూసినట్లుందే అని అనుకుని ఉంటారు. కానీ పేరే గుర్తురాకపోయి ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చి 11 ఏళ్లవుతున్నా సరే ఆ విషయంలో అస్సలు తగ్గట్లేదు. మరి ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా?
సాధారణ హీరోయిన్లకు వయసు పెరుగుతున్న కొద్దీ అందం తగ్గిపోతుందని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలామంది బ్యూటీస్ ని చూస్తుంటే అది అబద్ధం అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉన్న లయనే తీసుకోండి. అప్పుడెప్పుడో 15-20 ఏళ్ల క్రితం హీరోయిన్ గా చేసిన ఈమె.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిపోయినా సరే తన అందాన్ని అలానే కాపాడుకుంటూ వచ్చింది. చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో చాలామంది భామలు ఉంటారు. పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ నే తీసుకుంటే దశాబ్దం క్రితమే తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే అదే ఫిజిక్ మెంటైన్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. మరి ఈ భామ ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ గా ఎప్పుడు ఎవరికి ఛాన్స్ వస్తుందనేది అస్సలు ఊహించలేం. అలా ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలోనే శాన్వీ శ్రీవత్సవకు అవకాశం వచ్చింది. ఆది సాయికుమార్ ‘లవ్ లీ’లో హీరోయిన్ గా చేసిన శాన్వీ.. తన క్యూట్ నెస్ తో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సుశాంత్ ‘అడ్డా’, మంచు విష్ణు ‘రౌడీ’, ఆది ‘ప్యార్ మే పడిపోయానే’ లాంటి తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇవన్నీ కూడా 2012-14 మధ్య కాలంలోనే థియేటర్లలోకి వచ్చాయి. ఆ తర్వాత ఛాన్సులు రాకో ఏమో తెలియదు గానీ ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. 2014 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు తొమ్మిదేళ్లుగా అక్కడ వరస సినిమాలు చేస్తూనే ఉంది.
వారణాసిలో పుట్టి పెరిగిన శాన్వీ.. ఇండస్ట్రీలోకి వచ్చి 11 ఏళ్లు అవుతున్నా సరే తన ఫిజిక్ ని అద్భుతంగా మెంటైన్ చేస్తూ హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేస్తూనే ఉంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలనే తీసుకుంటే.. టైట్ ఫిట్ డ్రస్సులో అందాలను చూపిస్తూ చూపించకుండా అందరినీ ఊరించింది. ఒకటి రెండు కాదు ఏకంగా 10 ఫొటోల వరకు పోస్ట్ చేసి నెటిజన్లని రెచ్చగొడుతోంది. అయితే చాలామంది తెలుగు ఆడియెన్స్.. ఈ ఫొటోల్లో ఈమెని చూసి ఎక్కడో చూసినట్లు ఉందని అనుకున్నారు. వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత తెలుసుకుని.. అప్పుడేమో చిన్న పిల్లలా ఉండేది, ఇప్పుడేంటి ఇలా సూపర్ సె*క్సీగా తయారైంది అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్ ని చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.