లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే మూవీని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తుంది. ఇక సినిమా విజయం సాధించడంతో మూవీ యూనిట్ తాజాగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో ప్రదీప్ రంగనాథన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నేను 2007లో తీసిన అప్ షార్ట్ ఫిల్మ్ నే లవ్ టుడేగా తెరకెక్కించామని అన్నారు. మొబైల్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరు లవ్ టుడే సినిమాకు కనెక్ట్ అవుతారు గనుకే, ఈ మూవీకి మంచి టాక్ వస్తుందని నేను ముందే ఊహించానని, ఇప్పుడు అదే జరిగిందని ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశారు.కానీ తెలుగు ప్రేక్షకులు మా సినిమను ఇంతగా ఆదరిస్తారని నేను అస్సలు ఊహించనేలేదని హీరో ప్రదీప్ రంగనాథన్ తెలిపారు. ఇదిలా ఉంటే మూవీ ప్రిమియర్ ఇంట్రవెల్ సమయంలోనే నిర్మాత దిల్ రాజు గారు ఈ మూవీ సూపర్ హిట్ అని ముందే చెప్పారని, నిజంగానే ఈ మూవీ ఇప్పుడు మంచి విజయం సాధించిందని అనందం వ్యక్తం చేశారు.
ఇక ఇదే కాకుండా హీరో ప్రదీప్ రంగనాథన్ మరో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. నేను సన్నగా ఉన్నానని అందరూ నన్ను హీరో ధనుష్ తో పోల్చుతున్నారని అన్నారు. అలాంటి నటుడితో నన్ను పోల్చడం సంతోషమే కానీ, అతనితో నాకు పోలిక పెట్టడం సరికాదని, అలా పోల్చొద్దని ప్రదీప్ రంగనాథన్ తెలిపాడు. తాజాగా ప్రదీప్ రంగనాథన్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.