శేఖర కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా “లవ్ స్టోరీ”. చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన లవ్ స్టోరీ.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. ఈ మూవీ అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను “ఫిదా” చేసే స్థాయిలో ఉందా? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
లవ్ స్టోరీ కథ విషయానికి వస్తే.. రేవంత్ (నాగాచైతన్య) తెలంగాణలోని ఆర్మూర్ కుర్రాడు. హైదరాబాద్ లో జుంబ డ్యాన్స్ మాస్టర్ గా ఓ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్ రన్ చేస్తుంటాడు. తన బిజినెస్ ని పెంచుకుని, లైఫ్ లో సెటిల్ కావాలన్నది అతని కల. కానీ.., అతని పేదరికం దీనికి అడ్డంకిగా మారుతుంది. సరిగ్గా.. ఇదే సమయంలో మౌనిక(సాయిపల్లవి) సాఫ్ట్ వేర్ జాబ్ కోసం అదే ఆర్మూర్ నుండి హైదరాబాద్ చేరుకుంటుంది. కానీ.., ఆమెకి కూడా జాబ్ రావడం కష్టం అవుతుంది. ఇలాంటి సమయంలో రేవంత్ కి మౌనికాతో పరిచయం అవుతుంది. మౌనిక డ్యాన్స్ కి ఫిదా అయిన రేవంత్ ఆమెని తన పార్టనర్ గా చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడతారు. తరువాత వీరి లవ్ స్టోరీకి అడ్డంకిగా నిలిచిన పరిస్థితిలు ఏమిటి? చివరికి ఈ జంట ఒక్కటయ్యారా? లేదా? అన్నదే లవ్ స్టోరీ మూవీ.
విశ్లేషణ:
శేఖర కమ్ముల సినిమాల్లో ఒక లైఫ్ ఉంటుంది. ఆయన సినిమా కోసం ఏ నేపధ్యాన్ని తీసుకున్నా.. ప్రేక్షకుడు ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాడు. కమ్ముల తీసిన ఆనంద్, హ్యాపీడేస్, లీడర్, ఫిదా.. వంటి చిత్రాల్లో ఈ ఫీల్ ఉంటుంది. కానీ.., లవ్ స్టోరీ మూవీలో ఈ మ్యాజిక్ మిస్ అయ్యింది. హీరో లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇబ్బందులు పడే సీన్స్ తో సినిమా మొదలవుతుంది. ప్రేక్షకుడు కూడా ఇక్కడ బాగానే కనెక్ట్ అయ్యాడు. హీరో, హీరోయిన్ కలిశాక కూడా వాళ్ళ లవ్ ట్రాక్ కన్నా, వాళ్ళ బిజినెస్ క్లిక్ అవ్వడమే ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేసింది. కానీ.., అంత కష్టపడి సెట్ చేసుకున్న బిజినెస్ ని అర్ధాంతరంగా వదిలేయడం కన్వెన్స్ గా అనిపించదు.
తమ ప్రేమని బతికించుకోవడానికి హీరో, హీరోయిన్ వేసే ప్లాన్ కూడా ఆర్టిఫిషయల్ గా అనిపిస్తుంది. అక్కడ నుండి కూడా కథని ఎమోషనల్ గా డ్రైవ్ చేయడంతో లవ్ స్టోరీలో లవ్ తగ్గిపోయింది. ఇలా కథలోనే సరైన ఫ్లో లేకపోవడం ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్. స్క్రీన్ పై నాగచైతన్య-సాయిపల్లవి పెయిర్ మాత్రం ప్రేక్షకులకి ఐ ఫీస్ట్ ఇవ్వడం గ్యారంటీ. ఇందుకు తగ్గట్టే శేఖర్ కమ్ముల సినిమాలలో ఉండే సూపర్బ్ మూమెంట్స్ కొన్ని లవ్ స్టోరీలో కూడా ఉన్నాయి. ఇవి ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తాయి. కానీ.., కమ్మల ఈసారి హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ కన్నా.., వారి నేపధ్యాలను ఎక్కువగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేయడంతో కథ ట్రాక్ తప్పింది. ఇక విడుదలకి ముందే సినిమాపై అంచనాలు పెంచేసిన “సారంగ దరియా” పాట ప్లేస్మెంట్ కూడా సరిగ్గా కుదరలేదు. దీంతో.. విజువల్ గా ఆ పాటలో ఫీల్ అంతా పోయింది.
నటీనటుల పనితీరు :
సాయిపల్లవి ఒక సినిమాలో నటిస్తే.. ఆమె మిగతా అన్నీ క్యారెక్టర్స్ ని డామినేట్ చేయడం పరిపాటి. కానీ.., ఈసారి లెక్క మారింది. నాగచైతన్య తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ప్రాసెస్ లో చై ముందు..సాయిపల్లవి కూడా కాస్త తగ్గింది. కానీ.., జంటగా వీరు యాక్టింగ్ మాత్రం సూపర్భ్. ఈ సినిమాకి అతి పెద్ద ఎసెట్ కూడా ఈ జంటే. వీరి తరువాత ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్ర రాజీవ్ కనకాలది. హీరోయిన్ బాబాయ్ పాత్రలో రాజీవ్ దీ బెస్ట్ ఇచ్చేశారు. చాలా రోజుల తరువాత ఉత్తేజ్ కి వెయిట్ ఉన్న క్యారెక్టర్ పడింది. ఇక హీరో తల్లి పాత్రలో నటించిన ఈశ్వరీ రావు అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది. గంగవ్వ కూడా తన పాత్ర పరిధి మేర ఆకట్టుకుంది.
సాంకేతిక వర్గం:
సాంకేతిక వర్గం పని తీరు విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ సి. కుమార్ కెమెరా పనితనం గురించి. ఎలాంటి సెట్ లు, హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ లవ్ స్టోరీకి విజయ్ తన కెమెరా వర్క్ తో గ్రాండియర్ తెచ్చి పెట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు విడుదలకి ముందే సూపర్ హిట్ కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేశ్ కూడా పూర్తిగా న్యాయం చేశారు. కానీ.., దర్శకుడు శేఖర్ కమ్ముల కథ విషయంలోనే ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉండాల్సింది. నాగచైతన్య-సాయిపల్లవి లాంటి జంటని పెట్టుకుని, వారి మధ్య లవ్ ని లైటర్ వీన్ లో చెప్పడం, సమాజాన్ని ప్రశ్నించేలా బలమైన మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నించడం, ఆ ప్రాసెస్ లో క్లయిమ్యాక్స్ తేలిపోవడం లవ్ స్టోరీ స్థాయి తగ్గడానికి కారణం అయ్యాయి. కానీ.. మేకర్ గా మాత్రం శేఖర్ కమ్ముల తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నారు.
ప్లస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్:
చివరి మాట:
లవ్ మిస్ అయిన.. “లవ్ స్టోరీ”