మన దేశంలో సినిమాకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకే మన దగ్గర హీరోలకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోయిన్స్ ఎవరో, ఏమిటో తెలియకపోయినా వారికి పట్టం కట్టేస్తాము. నిజానికి ఈ లెక్కలు ఏవి కూడా సగటు ప్రేక్షకుడికి అర్ధం కావు. అర్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ లో కాస్త రిలాక్స్ కావాలి అనుకున్న సమయంలో ఫ్యామిలీతో అలా సరదాగా అలా ధియేటర్స్ కి వస్తారు. ఎంజాయ్ చేసి వెళ్తారు. సాధారణ ప్రేక్షకులకి ఇంత వరకే తెలుసు. కానీ.., మనం ఆహ్లాదం కోసం చూసే సినిమా సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తోంది. అంతా సవ్యంగా జరుగుంటే 2021లో ఇండియన్ సినిమా టర్నోవర్ సుమారు రూ.8000 కోట్ల. కానీ.., కరోనా సెకండ్ వేవ్ ఈ లెక్కలను మార్చేసింది. 2020 మార్చ్ నెల తరువాత కరోనా పంజా ఇండస్ట్రీపై పడింది. దీనితో ఎంతో కీలకమైన సమ్మర్ లో రిలీజెస్ లేకుండా పోయాయి. ఆ దెబ్బతో పెద్ద సినిమాల విడుదల తేదీలు మారిపోయాయి. అవన్నీ కూడా 2021 సమ్మర్ ని టార్గెట్ చేసుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ – తారక్- ప్రభాస్- మహేష్- పవన్ కల్యాణ్ వంటి అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. వీరు కాకుండా మిగతా మిడ్ రేంజ్ స్టార్స్ సినిమాలు కూడా ఆగిపోయాయి. సో.. 2021 సమ్మర్ కూడా ఖాళీ అయిపోయింది. మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలియదు. ఈ లెక్కన చూసుకుంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లాస్ రూ.1000 కోట్ల. ఇక వీటికి వడ్డీ లెక్కలు కడితే ఆ నష్టం ఇంకో రూ.200 రూపాయలు పెరగొచ్చు. ఇక కోలీవుడ్ ది కూడా ఇదే పరిస్థితి. కోలీవుడ్ అగ్రహీరోలు రజనీ కాంత్ నటిస్తున్న అన్నాథే.. అజిత్ నటిస్తున్న వలిమై.. విజయ్- చియాన్ విక్రమ్- కమల్హాసన్- సూర్య- విజయ్ సేతుపతి- ధనుష్- శివకార్తికేయన్- విశాల్ వంటి ప్రముఖ హీరోల సినిమాల షూటింగులు ఆగిపోయాయి. ఇవి 2021లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. సో.. తమిళ ఇండస్ట్రీకి కూడా ఓ రూ.1000 కోట్ల తప్పేలా కనిపించడం లేదు. ఇక బాలీవుడ్ పరిస్థితి మనకన్నా ఇంకా దారుణం. సూర్యవంశీ లాంటి భారీ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. అగ్ర హీరోల సినిమాలన్నీ షూటింగు దశలోనే ఉన్నాయి. అందువల్ల బాలీవుడ్ లో తెరిచి ఉంచిన థియేటర్లకు కూడా కంటెంట్ లేదు. కారణం ఏదైనా అక్కడ 4000 కోట్ల మేర నష్టం పక్కా అని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చేశాయి. సో, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లకి సెకండ్ వేవ్ కారణంగా రూ.6000 కోట్ల నష్టం ఏర్పడింది అనమాట.