హీరో, సెలబ్రిటీ, స్టార్స్ వీళ్లకు సమాజంలో ఉన్న మరో పేరే ఇన్‌ఫ్లూఎన్సర్స్. అంటే ప్రభావితం చేసే వ్యక్తులు అనమాట. వీళ్లు చెబితే ఓ నలుగురు అభిమానులు అయినా ఆ విషయాన్ని ఫాలో అవుతారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రిటీలతో ఎండార్స్ మెంట్లు చేయిస్తుంటాయి. ఓ పేరున్న వ్యక్తితో చెప్పిస్తే తమ ప్రోడక్టుకు డిమాండ్ వస్తుందనేది వారి ఆలోచన. ఓ చిన్న మోడల్ నుంచి బడా హీరోల వరకు ఎంతో మంది ఈ కమర్శియల్స్ చేస్తూనే ఉన్నారు, ఉంటారు. అయితే ఆ సో కాల్ట్ ఇన్ ఫ్లూఎన్సర్స్ ఎలాంటి వస్తువు/ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న.
ఇదీ చదవండి: బాలీవుడ్ ఇండస్ట్రీపై నటుడు జీవీ షాకింగ్ కామెంట్స్..!
మనకు టీవీ, సోషల్ మీడియాలో వచ్చే ఎన్నో యాడ్స్ బడా బడా హీరోలు, హీరోయిన్స్ చేస్తుంటారు. అయితే వాళ్లు చేసే ప్రమోషన్ ప్రజలకు హాని కలిగించేది కాకుంటే ఎలాంటి నష్టం లేదు. కానీ, పొగాకు కారకాలు ఉన్న ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ బాలీవుడ్ అగ్ర హీరోలు ఎన్నో ట్రోలింగ్స్ కు గురవుతున్నారు. బీ టౌన్ నుంచి చిన్నా చితక హీరోలు కాదు.. బిగ్ బీ స్థాయి వ్యక్తులు కూడా అలాంటి యాడ్స్ చేయడం అభిమానుల్లో వ్యతిరేకత పెరిగేలా చేసింది. మొదట అమితాబ్ బచ్చన్ ఓ పాన్ మసాలా యాడ్ చేసినప్పుడు ఆయన పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. తప్పు తెలుసుకున్న ఆయన వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేసుకుని.. తీసుకున్న డబ్బు తిరిగిచ్చేశారు.
అమితాబ్ బచ్చన్ మాత్రమే కాదు.. సంజయ్ దత్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టైగర్ షార్ఫ్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్, హృతిక్ రోషన్, రన్ వీర్ సింగ్ వంటి బడా హీరోలు ఇలాంటి యాడ్స్ చేశారు, కొందరు చేస్తూనే ఉన్నారు. ఆ యాడ్స్ కారణంగా ఈ స్టార్స్ అంతా ప్రేక్షకులు, అభిమానుల ట్రోలింగ్ కు గురవుతున్నారు. అక్షయ్ కుమార్ ఇటీవల ఓ పాన్ మసాలా యాడ్ లో చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అభిమానుల నుంచి పెద్దఎత్తున వచ్చిన వ్యతిరేకత చూసి వెంటనే ఆ యాడ్ విషయంలో అక్షయ్ వెనక్కి తగ్గాడు. కొన్ని చట్టపరమైన కారణాలరీత్యా వెంటనే ఆ యాడ్ నుంచి తప్పుకోలేను.. కానీ, భవిష్యత్ లో అలాంటి యాడ్స్ చేయనని మాటిచ్చారు. యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా మంచి పనికి వినియోగిస్తానన్నాడు. అయితే కొందరు హీరోలు మాత్రం అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లా స్పందించలేదు. అభిమానులు ఏమనుకున్నా.. వారు మాత్రం రెమ్యూనరేషన్ మీదే దృష్టి పెట్టారంటూ కామెంట్ చేస్తున్నారు. హీరోలు పాన్ మసాలా యాడ్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Akshay Kumar (@akshaykumar) April 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.