టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. విడుదలైన మొదటి రోజునుండే అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ.. ఫస్ట్ వీక్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ బ్రేక్ చేసింది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కీర్తిసురేష్ నటించింది. అయితే.. తన పర్సనల్ విషయాలను సందర్భాలు బట్టి షేర్ చేస్తుంటాడు మహేష్.
ఈ క్రమంలో ఇటీవల మహేష్ బాబు పీకాక్ మ్యాగజైన్ ఫోటోషూట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ ఫోటోషూట్ కి సంబంధించి పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా పీకాక్ మ్యాగజైన్ ర్యాపిడ్ ఫైర్ లో మహేష్ బాబు తన పర్సనల్/ప్రొఫెషనల్ విషయాలను టకాటకా బయటపెట్టేశాడు. అయితే.. ఈ ర్యాపిడ్ ఫైర్ లో మహేష్ ని రీసెంట్ గా ఏడిపించిన సినిమా ఏదని అడిగితే.. వెంటనే హాలీవుడ్ మూవీ.. ‘లయన్ కింగ్’ అని చెప్పాడు. ఆ సినిమా ఎప్పుడు చూసినా తాను ఎమోషనల్ అయిపోతానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మహేష్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.