ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు ఎన్నో విషాద వార్తలు అభిమానులను, సినీ ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. చాలామంది లెజెండ్స్ తో పాటు టెక్నీషియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ఇండస్ట్రీకి దూరమై విషాదాన్ని మిగిల్చారు. ఇంకా ఆ సంఘటనల నుండే కోలుకోలేదు. అప్పుడే కోలీవుడ్ లో ఓ ప్రమాదం జరిగి విషాదం చోటుచేసుకుంది. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం జరిగి ఓ టెక్నీషియన్ మరణించారు. చెన్నైలోని తిరువళ్లూరు ఏరియాలో ఉన్న ‘పంచతాన్ రికార్డింగ్ స్టూడియో’లో లైట్ బిగిస్తుండగా.. కరెంట్ షాక్ కి గురై లైట్ మెన్ కుమార్ అక్కడికక్కడే కన్నుమూసినట్లు సమాచారం.
ఈ సంఘటన కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం జరిగి లైట్ మెన్ చనిపోయేసరికి ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనలో లైట్ మెన్ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. స్టూడియోలో ప్రమాదం ఎలా జరిగింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రెహమాన్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది కోబ్రా, లైఫ్ ఆఫ్ ముత్తు, పొన్నియన్ సెల్వన్ లాంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ తో అలరించాడు. మరోవైపు రాబోయే రెండేళ్లపాటు లైనప్ చేసి పెట్టుకున్నాడు. మరి తన స్టూడియోలో జరిగిన ప్రమాదంపై రెహమాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.