ది లెజెండ్ హీరో అరుల్ శరవణన్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. అందుకు కారణం అతడి లేటెస్ట్ ఫోటో షూటే. తన నెక్ట్స్ సినిమా కోసం పూర్తిగా తన లుక్ ను మార్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఆయనకు సినిమాలంటే పిచ్చి.. అందుకే యాబై పదుల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ వయసులో ఇండస్ట్రీలోకి రావడం ఏంటి అని అతడిపై ఎన్నో విమర్శలు, మీమ్స్, ట్రోల్స్. కానీ అవన్నీ అతడిని హీరోని కాకుండా అడ్డుకోలేకపోయాయి. అతడే కోలీవుడ్ లెజెండ్ హీరో అరుల్ శరవణన్. తన తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అరుల్ శరవణన్. విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుగడించిన శరవణన్.. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. ది లెజెండ్ మూవీ తర్వాత మరో కొత్త మూవీని తర్వలోనే అనౌన్స్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చాడు ఈ లెజెండ్ హీరో. ప్రస్తుతం అతడి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
అరుల్ శరవణన్.. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న హీరో. ది లెజెండ్ సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయం అయిన ఇతడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకోసం ఏకంగా తన లుక్ నే పూర్తి మార్చేశాడు. ప్రస్తుతం అతడి లేటెస్ట్ ఫోటో చూస్తే.. అసలు ఇతడు ది లెజెండ్ హీరోనేనా అనే అనుమానం కలగక మానదు. అయితే సినిమాల కోసం హీరోలు తమ లుక్ ను పూర్తిగా మర్చడం మనకు తెలిసిన విషయమే. అందులో భాగంగానే తన రాబోయే సినిమా కోసం ఇలా లుక్ మార్చినట్లు తెలిపాడు. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని ట్వీటర్ వేదికగా రాసుకొచ్చాడు.
ఈ క్రమంలోనే తన నెక్ట్స్ ఫిలిం కోసం అరుల్ శరవణన్ పూర్తిగా మారిపోయాడు. ప్రస్తుతం అతడి ఫోటోలు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇక నెక్ట్స్ చేయబోయే సినిమా కూడా తన సొంత బ్యానర్ లోనే నిర్మించనున్నాడు అని సమాచారం. ఇప్పటికే విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్న ది లెజెండ్ శరవణన్.. ఇండస్ట్రీలో ఎలా రాణిస్తాడో చూడాలి. మరి ది లెజెండ్ శరవణన్ లేటెస్ట్ ఫోటో షూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
New Transition…
Details Soon…#Legend #TheLegend #LegendSaravanan #NewEraStarts pic.twitter.com/PilzbEHQut— Legend Saravanan (@yoursthelegend) March 13, 2023