సినిమాలలో హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు యంగ్ ఏజ్ లోనో.. లేక మిడిల్ ఏజ్ లోపు వస్తే బాగుంటుందని సాధారణంగా చెబుతుంటారు. వయసు మించిపోతే ఇక విలన్స్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ రాణిస్తుంటారు. గతేడాది తన 52 ఏళ్ళ వయసులో 'ది లెజెండ్' అనే సినిమా ద్వారా హీరోగా డెబ్యూ చేశాడు. మొదటి సినిమానే స్టార్ టెక్నికల్ టీమ్ తో దాదాపు రూ. 60 కోట్లదాకా బడ్జెట్ తో తానే స్వయంగా నిర్మించాడు.
సినిమాలలో హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు యంగ్ ఏజ్ లోనో.. లేక మిడిల్ ఏజ్ లోపు వస్తే బాగుంటుందని సాధారణంగా చెబుతుంటారు. ఇలాంటివి అందరూ కాకపోయినా.. దాదాపు ఎక్కువమంది 30 ఏళ్ళలోపే హీరోలుగా డెబ్యూ చేయడానికి సిద్ధపడతారు. ఆ వయసు మించిపోతే ఇక విలన్స్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ రాణిస్తుంటారు. అయితే.. ఓ హీరో.. 52 ఏళ్ళ వయసులో డెబ్యూ చేయడం గురించి విన్నారా? తమిళనాడులో శరవణ స్టోర్స్ గురించి వినే ఉంటారు. వందల బ్రాంచీలు కలిగిన ఆ స్టోర్స్ ఓనర్ లెజెండ్ శరవణన్. అదేంటీ ఇంటిపేరు లెజెండా అని ఆశ్చర్యపోకండి. లెజెండ్ అనేది ఆయన పెట్టుకున్న పేరే.. కానీ, ఇప్పుడాయన హీరో.
అవును.. ఆయన అసలు పేరు అరుళ్ శరవణన్. గతేడాది తన 52 ఏళ్ళ వయసులో ‘ది లెజెండ్’ అనే సినిమా ద్వారా హీరోగా డెబ్యూ చేశాడు. మొదటి సినిమానే స్టార్ టెక్నికల్ టీమ్ తో దాదాపు రూ. 60 కోట్లదాకా బడ్జెట్ తో తానే స్వయంగా నిర్మించాడు. మొత్తానికి సినిమాని చాలా మంది స్టార్ హీరోయిన్స్ చేత ప్రమోషన్స్ చేసి.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు. కానీ.. లెజెండ్ ని హీరోగా యాక్సెప్ట్ చేయలేక థియేటర్స్ కి ఎవరు వెళ్ళలేదు. దీంతో కలెక్షన్స్ పరంగా ఫెయిల్ అయ్యింది. టెక్నికల్ టీమ్ బాగున్నప్పటికీ.. హీరోగా లెజెండ్ సూట్ కాలేదని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో సినిమాని దాదాపు రిలీజైన ఏడు నెలల వరకు ఓటిటి రిలీజ్ చేయలేదు.
ఇటీవల ది లెజెండ్ ఓటిటి స్ట్రీమింగ్ మొదలైంది. థియేట్రికల్ గా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటిటిలో మిక్సెడ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో లెజెండ్ శరవణన్.. తన గురించి, తన సినిమా గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందించాడు. ది లెజెండ్ రిలీజ్ అయ్యాక చాలామంది తనని పర్సనల్ గా ఫోన్ చేసి కామెంట్స్ చేశారని చెప్పిన శరవణన్.. ఇప్పుడు ఆ సినిమాని హాట్ స్టార్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అయితే.. ముందునుండే తనకు మీడియాతో మంచి అనుబంధం ఉందని.. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. విమర్శలే విజయానికి తొలిమెట్టుగా భావించి ముందుకు వెళ్తానని షాకిచ్చాడు లెజెండ్.
ప్రస్తుతం లెజెండ్ మాటలకు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కాగా.. శరవణన్.. తన సెకండ్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అనౌన్స్ చేయనున్నారని టాక్. అయితే.. శరవణన్ నుండి సెకండ్ మూవీ రానుందని తెలిసేసరికి.. ఆడియెన్స్, నెటిజన్స్ సోషల్ మీడియా వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ వయసులో అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తున్నాడని.. అంతేగాక హీరో అని పరువు కూడా పోగొట్టుకుంటున్నాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతను నటించే బదులు.. సినిమాలను వేరే హీరోలతో నిర్మిస్తే మంచి లాభాలైనా వస్తాయని ఇంకొందరి అభిప్రాయం. మరి అరుళ్ శరవణన్.. ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడో తెలియాల్సి ఉంది. మరి విమర్శలే విజయాలకు నాంది అంటున్న లెజెండ్ శరవణన్ కాన్ఫిడెన్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.