Arul Saravanan: అర్ధ రూపాయి షాంపూకైనా కోట్లు పెట్టి సెలబ్రిటీలతో యాడ్స్ చేయిస్తారు. అది బిజినెస్ స్ట్రాటజీ. అర్ధ రూపాయి షాంపూకే అంత పబ్లిసిటీ చేసినప్పుడు కోట్లు పెట్టి తీసిన సినిమాకి ఏ రేంజ్ మార్కెటింగ్ చేయాలి. అందుకే ఒక్కో నిర్మాత.. తమ మూవీ యూనిట్‌తో భారీగా తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్క అరుళ్ శరవణన్ మాత్రం ఇందుకు భిన్నం. తన సినిమాని భిన్నంగా ప్రమోట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘ది లెజెండ్’ మూవీకి సంబంధించి ప్రేక్షకుల కోసం ఒక ఆఫర్ ప్రకటించారు.
అదేంటంటే ఆయన స్టోర్స్‌లో బట్టలు కొన్నవారికి ఆయన సినిమా చూసే అవకాశం దక్కుతుంది. చెన్నైలో ఉన్న శరవణన్ స్టోర్స్‌లో బట్టలు కొంటే అక్కడి సిబ్బంది ‘ది లెజెండ్’ మూవీ టికెట్స్ ఉచితంగా ఇస్తారట. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “జనాలు సినిమా చూడడం లేదని రివేంజ్ ఈ రకంగా ప్లాన్ చేశారన్న మాట” అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. “నా దగ్గరున్న ‘ది లెజెండ్’ టికెట్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకుని ఒక క్యారీ బ్యాగ్ ఇవ్వండంటూ” మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక జేడీ అండ్ జెర్రీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ జూలై 28న రిలీజైన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ తమిళ కళాఖండాన్ని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జనాలకి కూడా సినిమా చూపించేందుకు ఇలాంటి ట్రిక్కులే ప్లే చేస్తారా? లేక వేరే ఏదైనా ఐడియా వేస్తారో చూడాలి. మరి తన స్టోర్స్‌లో బట్టలు కొన్న వారికి మూవీ టికెట్లు ఫ్రీగా ఇస్తున్న అరుళ్ శరవణన్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
The Legend Saravana stores🤨 pic.twitter.com/ZRlU53Yvep
— அராத்து RK (@RKrakrish) July 31, 2022