ఝుమ్మంది నాదం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన భామ తాప్సీ. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. తెలుగులో రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తాప్సీ గురించి ఓ క్రేజీ అప్‌డేట్ బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే తాప్సీ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆ వివరాలు..
తాప్సీ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సోదరి షగున్ పన్ను ద్వారా మాథియాస్ బో తాప్సీకి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరు టూర్లు, వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో త్వరలోనే వీర్దిదరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తెరమీదకు వచ్చాయి. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్ళికి అంగీకరించడమే కాకుండా వివాహ ముహుర్తాన్ని కూడా నిర్ణయించేశారట. త్వరలోనే అధికారికంగా తాప్సీ పెళ్లి ప్రకటన రానున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అమ్మడు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని టేకప్ చేస్తూ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ తరువాత తెలుగులో `మిషన్ ఇంపాజిబుల్’ లో కనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.