చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. దాంతో అనేక మంది యువతీ.. యువకులు దానికి అట్రాక్ట్ అవుతారు అనడంలో సందేహం లేదు. ఈక్రమంలోనే తమ బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంత మంది నటీమణులను శారీరకంగా వాడుకుని వదిలేసిన సంఘటనలు మనం ఇండస్ట్రీలో చాలానే చూశాం. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో దారుణ సంఘటన పరిశ్రమలో వెలుగులోకి వచ్చింది. ఓ తెలుగు నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా తన కోరిక తీర్చుకున్న ఓ జిమ్ ట్రైనర్.. తీరా పెళ్లి చేసుకుందాం అనే సరికి ప్లేట్ ఫిరాయించిన ఘటన తాజాగా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఓ నటి అవకాశాల కోసం, షూటింగ్ నిమిత్తం కొన్ని రోజులుగా ముంబాయిలో ఉంటుంది. ఈ క్రమంలోనే సదరు నటి కొన్ని రోజుల క్రితం ఓ జిమ్ లో చేరింది. ఆ జిమ్ ఓనర్ ఆదిత్యకపూర్ తో ఆ నటికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా పెరగడంతో ఆదిత్య కపూర్ ఆ నటిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అతడి మాటలను నమ్మిన నటి అతడి ప్రేమను అంగీకరించింది. దాంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇదే అదునుగా భావించిన ఆదిత్య కపూర్ ఆ నటిపై పలు మార్లు అత్యాచారానికి దిగాడు. ఐతే ఇప్పుడు ఆ నటి పెళ్లి ప్రస్తావన ఎత్తగానే అతడు ప్లేట్ ఫిరాయించాడు. వివాహం చేసుకోనని చెప్పినట్లు, ఫిర్యాదులో నటి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
అదీ కాక పెళ్లి విషయం మాట్లాడితే నటిని అసభ్య పదాలతో తిట్టినట్లు, దాడి చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే గతంలో అతడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను చూపించి సదరు నటిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు వివరించింది. నటి ఫిర్యాదుపై కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. నిందితుడు ఆదిత్యకపూర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వివరించారు. ఎన్నో ఆశలతో తమలోని నటనని బయటకి చూపించాలని వచ్చే చాలా మంది నటీ మణులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురౌతూనే ఉన్నాయి. మరి ముంబాయిలో జరిగిన ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.