ప్రముఖ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం మృతి చెందారు. కోవిడ్ బారిన పడిన లతా మంగేష్కర్ గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం తుది శ్వాస విడిచారు. అయితే లతా మంగేష్కర్ జీవితంలో సినిమాను తలదన్నె ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయాలను లతా మంగేష్కర్ కు అత్యంత సన్నిహితుడైన పద్మ సచ్‌దేవ్ స్వయంగా వెల్లడించారు. ఆయన లతా మంగేష్కర్ జీవితంపై ఓ పుస్తకన్ని రాశాడు. దీనిలో తొలిసారి ఆయన లతా మంగేష్కర్ పై జరిగిన హత్యాయత్నం గురించి తెలిపారు. భారత రత్న సాధించిన ఈ మహా గాయనిని ఒక దశలో కొందరు వ్యక్తులు హత్య చేసేందుకు ప్రయత్నించారట.
లతా మంగేష్కర్ జీవితం ఆధారంగా రాసిన ‘ఐసా కహన్ సే లావూన్’ పుస్తకంలో తొలిసారిగా ఆమె మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి వివరించాడు. 1963లో ఆమె మీద ఈ కుట్ర జరిగినట్టుగా సచ్‌దేవ్ వెల్లడించాడు. అయితే దేవుడి దయ వల్ల ఆమెకు ఏమీ జరగలేదని తెలిపారు. ఈ విషయం గురించి స్వయంగా లతా మంగేష్కరే తనతో చెప్పారని సచ్‌దేవ్ వెల్లడించాడు. తన 33 ఏళ్ల వయసులో అంటే 1963లో లతాజీకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. రెండు మూడు సార్లు పచ్చ రంగులో వాంతులు కూడా అయ్యాయి. ఆ సమయంలో లతా తన చేతులు కూడా కదిలంచలేకపోయారు. ఒల్లంతా తీవ్రమైన నొప్పులు వచ్చాయి. మూడు రోజుల పాటు మరణానికి చేరువగా ఉన్న ఆమె ట్రీట్‌మెంట్ ద్వారా ఆరోగ్యం మెరుగుపడింది. కొంత కాలానికి ఆమె పూర్తిగా కోలుకున్నారు.ఆ సమయంలో డాక్టర్లు స్లో పాయిజన్ కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే లతా మంగేష్కర్ వంట మనిషిని తొలగించారు. ఆ తర్వాత అతను కనీసం జీతం తీసుకోవడానికి కూడా రాకుండా వెళ్లిపోయాడని పద్మ సచ్‌దేవ్ తన పుస్తకంలో వెల్లడించారు. దీంతో కొంత కాలం పాటు లతా తినే ఆహారాన్ని పరీక్షించిన తరువాత ఆమెకు వడ్డించారు. ఎక్కువగా లిరిసిస్ట్ మజ్‌రూహ్ సుల్తాన్‌పురీ ఆమె ఆహారాన్ని పరీక్షించేవారట. గతంలో ఓ లండన్ బేస్డ్ సినీ రచయితకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా లతా మంగేష్కర్ ఈ విషయాన్ని వెల్లడించారు.