గాన కోకిలగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మృతి చెందారు. తన గాత్రంతో భారత సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో 30వేలకు పైగా పాటలు పాడి.. సంగీత ప్రియుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఇక ఏళ్ల పాటు బాలీవుడ్ ని తన గాత్రంతో ఏలారు లత. కొన్ని దశాబ్దాల పాటు ఆమె టాప్ గాయనిగా కొనసాగారు. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా టాప్ లోనే నిలిచారు. బాలీవుడ్ అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న సింగర్ గా నిలిచిపోయారు. అయితే ఆమె జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నారు. సాధారణంగా మరణాంతరం వారి ఆస్తులు పిల్లలకు లేదా భర్తకు చెందుతాయి. మరి జీవితాంతం ఒంటరిగా ఉన్నారు లత. ఈ క్రమంలో ఆమె ఆస్తులకు వారసులెవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్లపైనే.
ఇది కూడా చదవండి : లతా మంగేష్కర్ పై హత్యాయత్నం..
ఒంటరి మహిళ కావడం చేత లతా మంగేష్కర్ ఆస్తులు ఆమె తోబుట్టువులైన ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు ఆస్తి దక్కుతుందని అంటున్నారు. మరోక వాదన కూడా వినిపిస్తుంది. అదేంటంటే.. లత ఆస్తులు ఆమె తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్‌కు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె చెల్లెల్లు, సోదరుడు గాయకులుగా మంచి పోజిషన్లో ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు. ఈ క్రమంలో లతా మంగేష్కర్ ఆస్తులు ట్రస్ట్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
ఇది కూడా చదవండి : లతా మంగేష్కర్ పాటల్లోని టాప్ 10 సాంగ్స్
ఓ మీడియా రిపోర్టు ప్రకారం.. లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 200 కోట్లకు పైనే ఉంటాయని సమాచారం. ఆమె చివరి వరకు ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉన్నారు. అంతేకాక ముంబై పెద్దర్ రోడ్లో మరో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆమెకి పాటల ద్వారానే కాక అద్దెల రూపంలో కూడా సంపాదన వస్తుంది. అలానే ఆమె పాడిన పాటలకు రాయల్టీ ద్వారా సంవత్సరానికి దాదాపు 5 కోట్ల పైగానే ఆదాయం వస్తోందని సదరు నివేదిక వెల్లడించింది. మరి ఇన్ని వందల కోట్లు ఆస్తులకు వారసులెవరనేది త్వరలో తేలనుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.