ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్‌కి రెడీ. ప్రస్తుత పరిస్థితులలో షోని నిర్వహిస్తారో లేదో అని అందరు ఎదురు చూస్తున్న క్రమంలో ప్రోమో విడుదల చేసి ఆశలు పెంచారు. సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ షో మొదలు కానున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ షోకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోయిన కూడా సీజన్ 5లో పాల్గొనే కంటెంస్టెంట్స్ వీరేనంటూ పలు లిస్ట్‌లు విడుదల చేస్తున్నారు. ఆ లిస్ట్‌లో యాంకర్ రవి, వర్షిణి, సిరి హన్మంత్, జబర్దస్త్ సాయి తేజ(ప్రియాంక సింగ్), నవ్యస్వామి, విష్ణుప్రియ, సీరియల్ నటి ప్రియ, సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్, సీరియల్ హీరో మానస్, హీరోయిన్ ఇషా చావ్లా, లోబో, యూట్యూబర్ సరయు, సురేఖా వాణి ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.
మొదట్నుంచి యాంకర్ రవి పేరు బాగా వినిపిస్తుండగా, దీనిపై రవి కాని అతని స్నేహితులు ఎవరు కాని నోరు విప్పలేదు. కానీ యాంకర్ లాస్య నోరు జారడంతో ఇప్పుడు రవి బిగ్‌బాస్ ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చింది. రవి – లాస్య అంటే ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో! రవి, లాస్యలది ఓ సెన్సేషన్. ట్రాకులు,లవ్ స్టోరీలు అనేవి లేని రోజుల్లోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైన జంట. సంథింగ్ స్పెషల్ అంటూ చేసిన పాటల ప్రోగ్రాంతో ఈ జంటకు దక్కిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ వారి ప్రభ కొన్ని రోజులకే పరిమితమైంది. ఇద్దరి మధ్య ఏవో కొన్ని గొడవలు జరగడం, విడిపోవడంతో ఆన్ స్క్రీన్ మీద జంటగా కనిపించకుండాపోయారు.
‘కనబడుట లేదు’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఈ ఇద్దరు హోస్ట్ చేశారు. ఈ వేడుకకు రామ్‌గోపాల్ వర్మ, విజయేంద్ర ప్రసాద్ సహా చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. రవి బిగ్‌బాస్ ఎంట్రీపై లాస్య నోరు జారింది. ‘కనబడుట లేదు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితో సరదాగా మాట్లాడుతూ నువ్వు కూడా తొందరలోనే ‘కనిపించకుండా పోతావట’ కదా… ఏదో హౌస్‌లోకి వెళ్తున్నావట కదా అంటూ నోరు జారింది లాస్య. వెంటనే ఉలిక్కిపడ్డ రవి నేను ఏ హౌస్‌కు వెళ్తా నా హౌస్‌కే వెళ్తా అంటూ బదులిచ్చాడు.
ఏదేమైనా అప్పటికే అభిమానులు రవి బిగ్ బాస్ ఎంట్రీపై ఓ క్లారిటికీ వచ్చేశారు. ఇదిలా ఉంటే లాస్య బిగ్ బాస్ హౌజ్ సీజన్ 4కి వెళ్లగా అప్పుడు 70 రోజులు ఉండొచ్చింది. ఆమకు వంటలక్క బిరుదు ఇచ్చారు హౌజ్‌మేట్స్.