Lakshmi Vasudevan: ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువయిపోయాయి. సామాన్య ప్రజల దగ్గరినుంచి పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలటం లేదు. పలు రకాలుగా వారిని తమ వలలో పడేటట్లు చేసుకుంటున్నారు. తర్వాత వేధింపులకు గురిచేస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా,శారీరకంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తాజాగా, ప్రముఖ సీరియల్ నటి లక్ష్మీ వాసుదేవన్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. వారి వేధింపులకు బలవుతున్నారు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో పెట్టడమే కాకుండా.. లోన్ తీసుకున్నావంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయంపై లక్ష్మీ ఓ వీడియో ద్వారా స్పందించారు.
వేధింపులపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ అందరికీ నమస్కారం. నా వాట్సాప్‌లో ఉన్న వారందరికీ ఈ మెసేజ్ ఇవ్వాలని అనిపించింది. నా ఫొటోలను ఎవరో మార్ఫింగ్ చేసి, నా వాట్సాప్‌లో ఉన్న వారందరికి కొత్త నెంబర్‌నుంచి పంపుతున్నారు. ఇది ఎక్కడ మొదలైందో నేను చెబుతాను. నాలా ఎవ్వరూ ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలని ఇది చెబుతున్నా. ఓ వారం రోజుల క్రితం సెప్టెంబర్ 11న నాకో మెసేజ్ వచ్చింది. అందులో నాకు 5 లక్షల రూపాయల లక్కీ మనీ వచ్చినట్లు ఉంది. నేను ఆ లింక్‌ను క్లిక్ చేశాను. అప్పుడు ఓ యాప్ ఆటోమేటిక్‌గా నాఫోన్‌లో డౌన్‌లోడ్ అయింది.
ఆ యాప్ డౌన్‌లోడ్ అయిన కొద్దిసేపటికే నా ఫోన్ హ్యాక్ అయింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత కొద్దిరోజులకు నాకు కొన్ని మెసేజ్‌లు రావటం మొదలైంది. మీరు లోన్ తీసుకున్నారు.. ఐదు వేల రూపాయల లోన్ తీసుకున్నారు. ఆ లోన్ కట్టలేదు అని మెసేజ్‌లు వస్తున్నాయి. మెసేజ్‌లు మాత్రమే కాదు.. ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు వస్తున్నాయి. గలీజ్‌గా తిడుతున్నారు. 5 వేల లోన్ కట్టకపోతే మీ మార్ఫింగ్ ఫొటోలు అందరికీ పంపిస్తామని బెదిరిస్తున్నారు. అప్పుడు నాకు అందులోని తీవ్రత తెలిసి వచ్చింది. వెంటనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.
అయితే, నా వాట్సాప్ కాంటాక్ట్స్‌లో ఉన్న కొంతమందికి మార్ఫింగ్ ఫొటోలు వెళ్లాయి. నా వెంట ఉన్న వాళ్లందరికీ తెలుసు నేను ఎలాంటి దాన్నని. నా ఫ్రెండ్స్, తల్లిదండ్రులకు, బంధువులకు ఈ ఫొటోలు వెళ్లిపోయాయి. తప్పుడు యాప్ డౌన్‌లోడ్ చేసి నేను అనుభవిస్తున్నాను. మీ ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తులనుంచి ఫోన్ వస్తే.. వాళ్లు చెప్పేవి నమ్మకండి. యాప్స్ డౌన్‌లోడ్ చేయకండి’’ అని కోరింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nirmalamma: నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!