టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలలో ఒకరైన మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు చెఫ్ మంత్ర లాంటి ప్రోగ్రామ్స్ ప్రెజెంటర్ గా ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 17 లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన లక్ష్మి.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ముందే ఉంటుంది. తెలుగులో పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్న మంచులక్ష్మి.. విలన్ రోల్స్ తో పాటు హీరోయిన్ గా, కీలక పాత్రధారిగా చాలా సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ట్రోల్స్ ని కూడా పాజిటివ్ గా తీసుకుంటుంది.
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకొని.. ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలు నిర్మించింది. అయితే.. తెలుగులోకి రాకముందు మంచులక్ష్మీ పలు ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.. గ్లామర్ విషయంలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి కిక్కిచ్చే లక్ష్మి.. ఈసారి ఏకంగా థండర్ థైస్ అందాలు చూపించి మాయ చేసే ప్రయత్నం చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొత్త వీడియోలో.. స్టైలిష్ బ్లూ డ్రెస్ లో అందాల ట్రీట్ ఇచ్చింది. ప్రెజెంట్ లక్ష్మి గ్లామర్ షోని ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్స్. మరి మంచు లక్ష్మి అందాల ట్రీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.