తెలుగు ఇండస్ట్రీలో నటి, నిర్మాత, హోస్ట్ గా మంచు లక్ష్మీ ప్రసన్న తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. మంచు మోహన్ బాబు నట వారసురాలిగా ‘అనగనగా ధీరుడు’మూవీతో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటించడమే కాదు.. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘టీసీ కండ్లెర్’ అనే సంస్థ ప్రతి ఏడాదీ ప్రకటించే 100 మోస్ట్ బ్యూటీఫుల్ ఫేసెస్ గ్లోబల్ లిస్టులో, 2022లో భాగంగా మంచులక్ష్మి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా మంచులక్ష్మి తన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. వివరాల్లోకి వెళితే..
ప్రతి ఏడాదీ 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ లిస్ట్ టీసీ క్యాండ్లర్, ది ఇండిపెండెంట్ క్రిటిక్స్ ద్వారా 1990 నుండి ఏటా విడుదల చేస్తుంది. ఈ కేటగిరిలో సినీనటులు, టీవీ ప్రముఖులు, కె-పాప్ కళాకారులు మొదలైన 40 దేశాలకు పైగా ఈ జాబితా ఉంటాయి. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ‘భారతదేశపు టాప్ 100 అందమైన ముఖాలలో ఒకరిగా నా పేరుని నామినేట్ చేసిన పాట్రియోన్‌కు ధన్యవాదాలు. భారత దేశం తరుపు నుంచి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తుంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.
100 మోస్ట్ బ్యూటీఫుల్ ఫేసెస్ గ్లోబల్ లిస్టులో మంచు లక్ష్మీ పేరు రావడంపై ఆమె కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మీకి కంగ్రాట్స్ చెబుతూ ఎన్నో పోస్టులు చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#LakshmiManchu Makes It to 100 Most Beautiful Faces List by TC Candler@LakshmiManchu https://t.co/uIkJNCUuop
— LatestLY (@latestly) August 18, 2022