పూరీ జగన్నాథ్.. మాటలతో తూటాలు పేల్చగల రచయత. 60 రోజుల్లో సినిమా తీసి, ఇండస్ట్రీ హిట్ కొట్టగల దర్శకుడు. ఇక జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా, అంతకు మించిన ఆత్మ స్థైర్యంతో నిలదొక్కుకుని మళ్ళీ నిలబడ్డ నిజమైన విజేత. అలాంటి పూరీ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. ఇక పూరి జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా స్టార్ రైటర్ లక్ష్మీ భూపాల ఫేస్ బుక్ లో పూరీ గురించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేసి, విషెస్ అందించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకే ఆ పోస్ట్ యధావిధిగా ఇక్కడ అందిస్తున్నాం.
“జీవితం ఎవ్వడ్నీ వదలదు భయ్యా.. అందరి సరదా తీర్చేస్తది..ఈ డైలాగ్ రాయాలంటే రైటర్ అయితే సరిపోదు.. ఆల్రెడీ సగం జీవితం రకరకాలుగా సంకనాకిపోయుండాలి..నమ్మినోళ్లు దెబ్బేసుండాలి, లేదా నమ్మకం పైనే విరక్తి వచ్చేసి ఉండాలి..మామూలు మనుషులైతే ఇలాంటి పరిస్థితుల్లో కుదేలైపోయి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, రోగాలు తెచ్చేసుకుంటారు.. కానీ ఈ డార్లింగ్ కో పేరుంది.. ఆ పేరు పూరీజగన్నాధ్.పడిన ప్రతిసారీ రెట్టింపు వేగంతో లేచే బంతి వాడు. ఉవ్వెత్తున ఎగిసే కెరటం వాడు. కుదిరితే చుక్కలతో ఫుట్ బాల్ ఆడొచ్చే ప్లేయర్ వాడు.
నేను చెప్తున్నది సినిమాల గురించి అస్సలు కాదు. డార్లింగ్ పూరీ లైఫ్ గురించి. ఒక్కోసారి అనిపిస్తుంది.. ఈడెబ్బా.. ఈడు మనిషేనా! ఆ లోపలున్నది గుండేనా? లేక ఉక్కు రాడ్డా?’ అని.1996-97 టైమ్ లో ఫస్ట్ టైమ్ పూరీ కజిన్స్ నాయుడు, సన్నీ వాళ్ళతో తన ఫ్లాట్ లో 2,3 సార్లు, ఇరానీ కేఫ్ లో కొన్నిసార్లు కలిసాను. చాలా టెలిఫిలింస్ తీసాడు, డైరెక్షన్ ట్రైల్స్ లో ఉన్నాడు అని తెలిసింది. కామన్ ఫ్రెండ్స్ తో కలవడమే కానీ, పర్సనల్ ఫ్రెండ్షిప్ తక్కువ నాకు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే బాగా రిచ్ కిడ్ బాబు అనుకున్నా. తర్వాత తెలిసింది, ‘నవ్వు’ ని మించిన ఐశ్వర్యం ఉండదని ముందే తెలుసుకున్నాడని.
అప్పట్లో సరదాగా మాతో ‘చచ్చిపోతే’ అని ఏదో కథ కూడా చెప్పినట్టు గుర్తు. తర్వాత కొన్నాళ్ళకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందని తెల్సింది.ఇపుడున్న కొందరిలాగా సగం సగం లైన్, సగం సీన్స్ కాకుండా, కథతో పాటూ కంప్లీట్ స్టొరీ బోర్డ్ గీసుకుని, 4,5 రకాల టైటిల్స్ రాసుకుని,కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలో ఒక ఫైల్ తయారుచేసుకుని, ఫుల్ హార్డ్ వర్క్ చేసి వెళ్లి మరీ ఒప్పించాడని తెల్సింది.. ఓహో.. డైరెక్టర్ అవ్వాలంటే ఇంత పకడ్బందీగా ఉండాలన్నమాట అనిపించింది. ఆ సినిమానే ‘బద్రి’.
‘బద్రి’ 2000 లో రిలీజ్ అయ్యింది. చూసాను. మైండ్ లిటరల్ గా దొబ్బింది. ఈ డైరెక్టర్ ‘నాకు తెల్సు’ అని నాకు తెల్సినోళ్ళకి చెప్పడానికి ఈగో అడ్డొచ్చింది.. ఆ ఇగో ఎందుకంటే నాక్కూడా తెలీదు. తర్వాత నేను అలా చూస్తూనే ఉన్నాను. అతనలా ఎదుగుతూనే ఉన్నాడు..
లెక్కేసుకోడానికి బద్దకం వచ్చినంత సంపాదించాడు. అదే బద్దకం ఇంకో మనిషి పైన నమ్మకం అయ్యింది. వచ్చింది కాస్తా ఏటో వెళ్ళిపోయింది..ఎలా పోయిందో తెలిసే లోపే మళ్ళీ నవ్వాడు.
“పెన్-పేపర్”పట్టుకున్నాడు. మళ్ళీ తొడకొట్టాడు. పడుతున్నాడు, లేస్తున్నాడు.. పడినప్పుడు తల ఎగరేస్తున్నాడు, లేచినప్పుడు నవ్వుతున్నాడు. కొన్నాళ్ళకు ఆ ఇగో స్థానంలో నాలోపల ‘గర్వం’ ‘సంతోషం’ వచ్చాయి. వాటిక్కూడా కారణం అప్పుడు తెలీదు నాకు..తర్వాత అర్ధమైంది. పూరీ సినిమాల్లో ఒకరకంగా పడి లేస్తుంటే, నేను జీవితంలో ఇంకో చోట పడి లేస్తున్నా అని.. అతనిలో నన్ను చూసుకున్నా అని.. “ఆడు మగాడ్రా బుజ్జీ” అని త్రివిక్రమ్ ఎవరి గురించి రాసినా, నాకు తెలిసి జీవితాన్ని ఎదురీత కొట్టడంలో పూరీ ని మించిన మగాడు లేడనిపిస్తుంది.
పూరీజగన్నాధ్ రాసే అద్భుతమైన కొన్ని నగ్న సత్యాలను జీవితం పూరీ ని కూర్చోబెట్టి నేర్పిస్తే, కొన్నింటిని పూరీ జీవితాన్ని కూర్చోబెట్టి రాయించినవి… అందుకే అంత రెబెల్ గా, సూటిగా, మొహం పగలగొట్టినట్టు ఉంటాయి..లవ్ యూ డార్లింగ్..నిన్ను పొగుడుతున్నానో, ఆ వంకతో నీలో నన్ను చూసుకుని మురిసిపోతున్నానో అర్ధం కావట్లేదు.హ్యాపీ బర్త్ డే”ఇది లక్ష్మీ భూపాల పోస్ట్. ప్రస్తుతం పూరీ అభిమానులను ఈ పోస్ట్ అమితంగా ఆకట్టుకుంటోంది. మరి.. ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.