ప్రముఖ నటి కుట్టి పద్మిని కమల్ హాసన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ ఆరుగురిని ప్రేమించి వేరే ఆమెను పెళ్లి చేసుకున్నారని ఆమె అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి స్టార్‌లు అయినవారు చాలా మందే ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించి, ప్రేక్షకుల మన్ననలు పొంది అంచలంచెలుగా ఎదిగిన వారిలో కుట్టిపద్మిని ఒకరు. కుట్టి పద్మిని తమిళనాడులో ఓ సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. నటి కుట్టిపద్మిని 3 సంవత్సరాల వయస్సు నుండి బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆమె బాలనటిగా చాలా సినిమాలలో నటించారు. దైవబలం, ఇల్లరికం, శాంతి నివాసం, మంచిమనసులు, ఇరుగుపొరుగు, అంతస్థులు మొదలైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. లేత మనసులు సినిమాలో బాలనటిగా తెలుగువారి గుండెల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
కొన్ని తమిళ చిత్రాలలో కూడా ఆమె నటించారు. పద్మిని నటనకు ఉత్తమ బాలనటిగా ‘జాతీయ చలనచిత్ర అవార్డు’ వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో ఆమె నటించారు. ఇక, కుట్టి పద్మిని తన అనుభవాలను ఎన్నోసార్లు ఇంటర్వ్యూల ద్వారా వ్యక్తపరిచారు. ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ పై ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కుట్టి పద్మిని మాట్లాడుతూ.. ‘‘ శ్రీదేవి, రేఖ, జయసుధ, గౌతమి, శ్రీవిద్య, సారికలతో కమల్ హాసన్ లవ్ అఫైర్ పెట్టుకున్నారు.
అందరూ ఆయన శ్రీవిద్యను పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ, కమల్ మాత్రం వాణి గణపతిని తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. కమల్ వాణి గణపతిని పెళ్లి చేసుకోవటంతో.. శ్రీవిద్య చాలా రోజులు మానసికంగా కుంగిపోయారు. కొన్ని నెలల తర్వాత జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అతనితో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని సినీరంగానికి దూరంగా ఉండిపోయారు. కొంత కాలం తర్వాత శ్రీవిద్య క్యాన్సర్ బారిన పడ్డారు. తన ఆస్తినంతా ఓ ట్రస్ట్ కు రాసేశారు’’ అని ఆమె చెప్పారు. మరి, కమల్‌పై కుట్టి పద్మిని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.