కుష్బూ సుందర్.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లోఉండేది అంటే.. ఆమెక అభిమానులు గుడి కట్టేశారంటే మీరే అర్థం చేసుకోవాలి. వెంకటేశ్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ సీనియర్ నటి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించింది. సీరియల్స్, షోస్ అంటూ అటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా కుష్బూ సుపరిచితురాలే. ఇటీవల శర్వానంద్ లీడ్ రోల్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో కలిసి భర్తను అనుమానించే ఓ అమాయకపు భార్యగా కుష్బూ చేసిన కమర్షియల్ యాడ్ ఫిల్మ్ అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే. సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించిన తర్వాత నుంచి కుష్బూ ఎంత బొద్దుగా అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కుష్బూకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కుష్బూ తీసుకున్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో కుష్బూ ఫేస్ ఎంతో సన్నగా ఉంది. అంతేకాదు.. ఆమెకున్న బుగ్గలు అవి ఏమాత్రమం కనిపించడం లేదు. 51 ఏళ్ల వయసులో కుష్బూ ఏకంగా 18 కిలోలు తగ్గి ఔరా అనిపించింది. అసలు ఆమె కుష్బూ అంటే నమ్మడానికి కాస్త సమయం పట్టిద్దనే చెప్పాలి. అయినా నాజూకుగా మారిన కుష్పూని చూసి మళ్లీ సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించాలంటూ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కుష్బూ లేటెస్ట్ ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.