KTR: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న హిందూ మైథలాజికల్ సినిమా ‘‘ ఆదిపురష్’’. బాలీవుడ్ దర్శకుడు ‘‘ఓం రౌత్’’ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్త సగటు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఈ సినిమాకోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ అభిమానులైతే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటం ఖాయం అంటున్నారు. తాజాగా, ఈ సినిమాపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఆదిపురుష్‌తో పాటు మొత్తం 15 సినిమాలు బీజేపీ ఐడియాలజీని వ్యాప్తి చేసే సినిమాలని ఆయన అన్నారు. ప్రధానంగా ఆదిపురుష్‌ను ప్రస్తావించారు. ఆ సినిమా సరిగ్గా ఎన్నికల టైంలో విడుదల అవుతుందని.. ఓటర్లను బీజేపీ గురించి, రామరాజ్యం గురించి ఆలోచించేలా చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ఏ రాష్ట్రాల ఎన్నికల్లో అయితే గెలవాలనుకుంటోందో.. ఆ రాష్ట్రాలకు సంబంధించిన నటుల్ని ఆ సినిమాలో పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. యూరీ-ది సర్జికల్ స్ట్రైక్, ది కశ్మీర్ ఫైల్స్, సినిమాలతో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మరి కొన్ని సినిమాలు కూడా బీజేపీ ఐడియాలజీ సినిమాలని అన్నారు. వాటికి బీజేపీ పరోక్షంగా ఫండింగ్ చేస్తోందని అన్నారు.
కాగా, రామాయణ ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న ‘‘ఆదిపురష్’’ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ‘‘సైఫ్ అలీఖాన్’’ రావణుడిగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 11, 2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఆదిపురుష్ సినిమాపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : సెట్స్ లో రాకీ భాయ్ ఎలా ఉండేవాడో చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ రుత్విక్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.